సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??

తాజాగా ఇండోర్‌లోని విజయ్ నగర్( Vijay Nagar In Indore ) ప్రాంతంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.

ఒక మహిళ తన అక్క, బావ మంత్రగాళ్లు అయ్యారనే ఆరోపణలు చేసింది.తనకు వాళ్లు చేతబడి చేశారని, తద్వారా తనకు హాని కలిగిస్తున్నారని ఆమె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఒక ఫిర్యాదు చేసింది.

ఈ ఘటన పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది.హనీ, సమీర్‌సూద్( Honey, Sameersood ) దంపతులు, మినీ, ఆదర్శ్‌సూద్ దంపతులు గత కొద్ది రోజులుగా పోట్లాడుకుంటున్నారు.

హనీ, మినీ అక్కా చెల్లెళ్లు కాగా, సమీర్, ఆదర్శ్‌ అన్నాదమ్ములు.నలుగురు కూడా విజయ్ నగర్‌లోని స్కీమ్-74లో నివసిస్తున్నారు.

విజయ్ నగర్ ఏసీపీ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, గురువారం రాత్రి హనీ, సమీర్ తమ ఇద్దరు కుమార్తెలు మెహక్, మన్నత్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు.

హనీ తన అక్క మినీ, బావ ఆదర్శ్‌ తమకు విషం కలిపిన ఆహారం ఇచ్చి చంపాలని ప్రయత్నించారని ఆరోపించింది.

ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.అక్కా చెల్లెళ్లు బ్లాక్ మెజీషియన్లు అయ్యారనే ఆరోపణలు ఎంతవరకు నిజం అనేది విచారణలో తేలియనుంది.

"""/" / హాని చెప్పిన వివరాల ప్రకారం, రాత్రి 10 గంటల సమయంలో మిని, రాణు( Mini, Rani ) అనే మహిళతో కలిసి వారి ఇంటికి వచ్చి వంటలో ఏదో పదార్థం కలిపింది.

దీన్ని గమనించిన హాని వారిని ప్రశ్నించింది.ఇది పెద్ద గొడవకు దారి తీసి, కొట్లాట కూడా జరిగింది.

ఈ గొడవ వీడియోను కూడా పోలీసులకు చూపించారు.అయితే మినీ తన వాదనలో తన చెల్లెలు, బావ, భర్త తనని ఇంటి నుంచి బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని, గత రెండు సంవత్సరాలుగా హింసిస్తున్నారని చెప్పింది.

తన భర్త ఆదర్శ్ నిమ్మకాయలతో మంత్రాలు చేస్తున్నాడని, నిమ్మరసం వంటివి వంటలో కలుపుతున్నాడని అనవసరంగా చెబుతున్నట్లు తెలిపింది.

"""/" / పోలీస్ స్టేషన్‌లో గంటల తరబడి ఈ నాటకం సాగింది.చివరికి పోలీసులు ఇదంతా కుటుంబంలోని గొడవగా ముగించారు.

కానీ హాని మాత్రం మినీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ఏసీపీ మాట్లాడుతూ ముంబైలో ఉండే ఆదర్శ్ పై కొన్ని రోజుల క్రితం కేసు నమోదైందని చెప్పారు.

ఇలాంటి ఘటనలు ఇటీవల కొత్తేం కాదు.కొన్ని నెలల క్రితం బెంగుళూరులో ఒక 25 ఏళ్ల యువతి తన ప్రియుడిని వెనక్కి తిప్పించుకోవడానికి 8.

2 లక్షల రూపాయల నష్టంతో చేతబడి ప్రయోగించింది కానీ ఫలితం లేకపోయింది.

ఎప్పుడు వచ్చామని కాదమ్మా.. రికార్డ్స్ బద్దలయ్యా లేదా (వీడియో)