కూసుమంచి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
TeluguStop.com
కూసుమంచి పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ అకస్మికంగా సందర్శించారు.
పోలీస్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు.
కేసుల వివరాలు, శాంతి భద్రతల ఆంశలపై పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని భద్రత పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రమాదాలు జరిగే ప్రదేశాలను సంబంధిత శాఖలతో సంప్రదించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రధానంగా విధినిర్వహణలో రాణించడంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలందించించేందుకు అమలవుతున్న ఫంక్షనల్ వర్టికల్స్ విధానంపై,5s ఇంప్లిమెంట్ పై సిబ్బంది మరింత దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదు చేసేందుకు వచ్చే బాధితుల ఫిర్యాదులపరిష్కారానికి అవసరమైన చట్టపరమైన చర్యలు త్వరితగతిన చేపట్టాలని సూచించారు.
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?