డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 36.436 కేజీల గంజాయిని కాల్చి బూడిద చేసిన పోలీసులు

రాజన్న సిరిసిల్లలోని రగుడు వద్ద గల డంప్ యాడ్ నందు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన 41 కేసులలో స్వాదీనపరచుకున్న 36 కిలోల 436 గ్రాముల నిషేధిత గంజాయిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మంగళవారం శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని అన్నారు.

జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని అన్నారు.జిల్లాలోని పోలీసుల స్వాధీనంలో ఉన్న మిగతా గంజాయిని కూడా విడతల వారీగా చట్ట ప్రకారం తగులబెట్టుట జరుగుతుందని తెలియజేసారు.

గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

ఎస్పీ వెంట అదనపు చంద్రయ్య,డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ఐ యాదగిరి, టౌన్ సి.

ఐ రఘుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

ఢిల్లీకి రేవంత్ ..  మంత్రివర్గ విస్తరణలో వీరికే ఛాన్స్ ?