రెండోసారి రాజాసింగ్ నీ అరెస్టు చేసిన పోలీసులు..!!

గోష్ మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

దీంతో హైదరాబాదులో చాలా ప్రాంతాలలో ముస్లింలు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారీ ఆందోళనలు చేపట్టారు.

ఈ క్రమంలో రాజాసింగ్ ని అరెస్టు చేయగా తర్వాత న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం జరిగింది.

41 CRPC నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసినట్లు.అందువల్ల బెయిల్ ఇచ్చినట్లు న్యాయస్థానం చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో తాజాగా పాత కేసులపై CRPC 41A కింద ఈరోజు ఉదయం మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చి రాజాసింగ్ నీ అదుపులోకి తీసుకున్నారు.

మూడు రోజుల వ్యవధిలో రెండోసారి అరెస్టు చేశారు.ఈ అరెస్ట్ కి కొద్ది నిమిషాలు ముందు సోషల్ మీడియాలో మరో వీడియో రాజాసింగ్ పోస్ట్ చేయడం జరిగింది.

మునావర్ షో వద్దని చేతులు జోడించి కోరిన కేటీఆర్ పట్టించుకోలేదని .ఇదే ఉద్రిక్తతలకు కారణమైందని తెలియజేశారు.

ఏది ఏమైనా మూడు రోజుల వ్యవధిలో రెండోసారి రాజాసింగ్ అరెస్ట్ కావటం సంచలనం సృష్టించింది.

హీరో అంటే ఇలా ఉండాలి.. కటింగ్ మధ్యలో ఆపేసి… ఏం చేశాడో చూడండి!