ఆరుగురు గొలుసు దొంగలు అరెస్ట్ చేసిన పోలీసులు

సూర్యాపేట జిల్లా:ఒంటరిగా నిద్రిస్తున్న మహిళా ఒంటిపై నుండి ఆభరణాలు దొంగిలిస్తున్న,నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న స్త్రీ,పురుషుల జంటలను బెదిరించి రాబరీలకు పాల్పడుతున్న, తాళం వేసి ఉన్న ఇంటిలో దంగతనాలు చేస్తున్న ఆరుగురు దొంగలను సూర్యాపేట జిల్లా ( Suryapet District)మునగాల, హుజూర్ నగర్,చివ్వెంల పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్(District SP Sunpreet Singh) శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు.

సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను మునగాల,హుజూర్ నగర్, చివ్వెంల పోలీసులు అరెస్ట్ చేసి,వారి నుండి 30 లక్షల విలువగల 35.

4 తులాల బంగారు,10 తులాల సిల్వర్ ఆభరణాలను,6 మొబైల్స్,3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని 6 గురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

అయితే చివ్వెంల పీఎస్ కేసులో ఒకరు పరారీలో ఉన్నారని,అతనిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?