హైపర్ ఆదిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారుతో యాక్సిడెంట్ చేయడంతో?
TeluguStop.com
బుల్లితెరపై ఈటీవీలో విజయవంతంగా ప్రసారమవుతున్న షోలలో శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా ఒకటనే సంగతి తెలిసిందే.
సుడిగాలి సుధీర్ తప్పుకోవడంతో ప్రస్తుతం రష్మీ ఈ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల కాగా ప్రోమోలో పోలీసులు హైపర్ ఆదిని అరెస్ట్ చేస్తున్నట్టు చూపించారు.
రామ్ ప్రసాద్ అరేయ్ ఆది నీకు సన్మానం చేద్దామని అనుకుంటున్నానని చెప్పగా అంటే సన్మానం చేసి వాడిలా నన్ను కూడా పంపిద్దాం అనుకుంటున్నారా అని ప్రశ్నించాడు.
ఒక ఎపిసోడ్ చూశారు కదా బాబు ఏమన్నాడని ఆది రష్మీని ప్రశ్నించారు.రష్మీ మాత్రం ఆ ప్రశ్నకు ఆది, రామ్ ప్రసాద్ లేకపోతే ఇంకా బాగుందని చెప్పాడని రష్మీ చెప్పుకొచ్చారు.
సుధీర్ అలా అన్నాడనే షో నుంచి పంపించామని హైపర్ ఆది కామెంట్లు చేశారు.
ఆ తర్వాత ఆదికి సన్మానం అని చెప్పగా ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే మీరంతా సన్మానం చేసుకుంటున్నారా అని చెబుతారు.
ఆది ఇక్కడ ఈ అమ్మాయికి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరో తెలియాలని ఆమె చెప్పగా ఆమె ఆదినే అన్యాయం చేశాడని చెబుతుంది.
ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.కెమెరా ఆపండని చెబుతూ పోలీసులు షోలో హడావిడి చేశారు.
ఒక పోలీస్ కారులో వచ్చిన సమయంలో ఒకరిని గుద్ది యాక్సిడెంట్ చేశారని చెప్పి హైపర్ ఆదిని అరెస్ట్ చేశారు.
ఆది యాక్సిడెంట్ చేసిన వ్యక్తి చావుబ్రతుకుల మధ్య ఉన్నాడని పోలీసులు తేల్చి చెప్పారు.
"""/"/
కెమెరాలన్నీ ఆఫ్ చేయండంటూ పోలీసులు హడావిడి చేశారు.అయితే రేటింగ్ కోసమే ఇలాంటి ప్రోమోలు విడుదల చేస్తున్నారని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఎపిసోడ్ ఈ నెల 12వ తేదీన ప్రసారం కానుంది.ఈ ప్రోమోకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్.. ఇండిపెండెన్స్ డే బాక్సాఫీస్ రేసులో గెలుపెవరిదో?