అబ్బ ఎంతపని చేసింది.. చికెన్ పకోడీ దొంగనోట్ల ముఠాను పట్టించింది!
TeluguStop.com
కొన్ని కొన్ని సార్లు దొంగలు కానీ నేరాలు చేసే ముఠాలు కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలని అనుకున్న కూడా ఎక్కడో ఒక చోట దొరికి పోతారు.
అసలు అలా దొరికి పోతామని ఆ నేరాలు చేసే వాళ్ళు కూడా అనుకోరు.
ఎన్ని నేరాలు చేసి దర్జాగా తిరుగుతున్న ఒక్క చిన్న తప్పు చాలు వాళ్ళను పోలీసులకు పట్టించడానికి.
తాజాగా దొంగ నోట్లు ముద్రించే ముఠా పోలీసులకు చిక్కింది.అది కూడా అనుకోకుండా.
ఎన్నో రోజులుగా దొంగ నోట్లు ముద్రిస్తూ యదేచ్చగా తిరుగుతున్నారు.కానీ చిన్న పని వాళ్ళను పోలీసులకు అడ్డంగా దొరికి పోయేలా చేసింది.
ఇంతకీ ఆ నేరగాళ్లు పోలీసులకు ఎలా చిక్కారా అని ఆలోచిస్తున్నారా.చికెన్ పకోడీ ఆ దొంగ నోట్లు తయారు చేసే ముఠాను పోలీసులకు ప్పట్టించింది.
అలా చికెన్ పకోడి ఎలా పట్టించిందా అని ఆలోచిస్తున్నారా.గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన నూర్ భాషా పాల వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు.
అతడు పనిమీద 25వ తారీఖున కర్నూలు జిల్లా మద్దికెర మండలం జొన్నగిరి వెళ్ళాడు.
అతడు అక్కడ ఒక షాపులో చికెన్ పకోడీ తిందామని షాపుకు వెళ్లి తీసుకున్నాడు.
నూర్ భాషా తన దగ్గర ఉన్న వంద నోటును ఇచ్చాడు.అయితే ఆ షాపు అతను అది దొంగ నోటు అని గుర్తు పట్టి వేరేది ఇవ్వమని అడిగాడు.
కానీ భాషా తన దగ్గర ఇదే ఉందని వేరేది లేదని చెప్పాడు. """/"/ అయితే వీరి సంభాషనంతా పక్కనే ఉన్న కానిస్టేబుల్ విన్నాడు.
నూర్ భాషను పట్టుకుని చెక్ చేయగా మూడు వేల రూపాయల వరకు దొంగ నోట్లు దొరికాయి.
దీంతో అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టైల్లో విచారించగా అసలు నిజం బయట పడింది.
నూర్ భాషా యూట్యూబ్ లో చూసి దొంగ నోట్లు తయారు చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు.
మరొక ఇద్దరు స్నేహితులతో కలిసి దొంగ నోట్లు ముద్రిస్తున్నట్టు తెలిపాడు.చుట్టూ పక్కల ప్రాంతాల్లో దొంగ నోట్లను పంపిణీ చేస్తున్నట్టు తెలిపాడు.
50 వేల అసలు డబ్బును తీసుకుని లక్ష రూపాయల నకిలీ నోట్లను ఇస్తున్నట్టు తెలిపాడు.
దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసారు.ఇన్ని రోజులు దొరకకుండా తప్పించుకుని ఇప్పుడు కేవలం చికెన్ పకోడి కోసం వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు.
ఉచిత బస్సు ప్రయాణం ఇప్పట్లో లేనట్టేనా ?