తాళి కట్టే కొన్ని క్షణాల ముందు వరుడుకి ఊహించని షాక్.. పోలీసుల ఎంట్రీ తో..!

మరి కాసేపట్లో వివాహం( Marriage ) జరుగుతుంది అంటే పెళ్లి పందిట్లో ఎంత సందడి ఉంటుందో అందరికీ తెలిసిందే.

కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పెళ్లి మండపం కిటకిటలాడుతుంది.అందరి మొహాలలో సంతోషం, పెళ్లి జరుపుతున్న కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు అనేవి ఉండవు.

అలాంటి సందడి వాతావరణంలో వరుడు తాళి కట్టేందుకు కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉండగా పోలీసుల ఎంట్రీతో వరుడుతో పాటు పెళ్లి పందిట్లో ఉన్న సభ్యులంతా షాక్ అయ్యారు.

సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాలలో చాలానే చూసాం.అచ్చం సినిమా సన్నివేశాలను తలపించేలా కామారెడ్డి జిల్లాలో( Kamareddy ) ఈ ఘటన చోటు చేసుకుంది.

కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ( Groom ) పోలీస్ జీప్ ఎక్కి జైలు పాలు అయ్యాడు.

ఆ వరుడు ఎందుకు అరెస్ట్ అయ్యాడో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మోగ గ్రామానికి చెందిన మారుతి( Maruthi ) అనే యువకుడికి వివాహం నిశ్చయమైంది.

"""/" / ఇరు కుటుంబ సభ్యులు మే 22 సోమవారం వివాహం జరిపించాలని ముహూర్తం ఖాయం చేసుకున్నారు.

ఇక ఇరుకుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు.సోమవారం వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు బంధువులతో పెళ్లి పందిట్లో సందడి నెలకొంది.

మరికొన్ని క్షణాల్లో పెళ్లి కొడుకు పెళ్లి పీటలు ఎక్కి వధువు మెడలో తాళి కట్టాల్సి ఉంది.

ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. """/" / ఓ యువతి తనను మారుతి ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని పోలీసులకు తెలిసింది.

ఇద్దరి మధ్య పెళ్లికి సంబంధించిన సంభాషణ వస్తే దాటవేసే ప్రయత్నం చేసేవాడని తెలిపింది.

తనకు తెలియకుండా మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు మారుతిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

పోలీసులు మారుతిని విచారించగా గతంలో మారుతి పలువురు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడిపి వారిని కూడా నమ్మించి మోసగించాడని ఆరోపణలు ఉన్నాయని ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.

కెనడా కొత్త వలస విధానం.. భారతీయ విద్యార్ధులకు బహిష్కరణ భయం