ఉమ్మడి ఖమ్మం, వరంగల్ ఏజెన్సీలో పోలీసుల హై అలర్ట్

ఉమ్మడి ఖమ్మం, వరంగల్ ఏజెన్సీలు పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.ఇవాళ్టి నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు పీఎల్జీఏ మావోయిస్టు వారోత్సవాలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.ఇందులో భాగంగా వెంకటాపురం, వాజేడు ఏజెన్సీలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రాత్రి సమయాల్లో ఏజెన్సీకి ఆర్టీసీ బస్ సర్వీసులను సైతం రద్దు చేశారు.అదేవిధంగా ప్రజా ప్రతినిధుల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

నేతలు ఎవరూ అనుమతి లేకుండా పర్యటనలు చేయొద్దని సూచించారు.మరోవైపు సమీప ప్రాంతంలోని అడవులను పోలీస్ బలగాలు జల్లెడ పడుతున్నాయి.

మావోయిస్టు వారోత్సవాలను భగ్నం చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఎలాగైనా వారోత్సవాలను విజయవంతం చేయాలతో పట్టుదలతో మావోలు ఉన్నారని సమాచారం.

దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో టెన్షన్ నెలకొంది.

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా చాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి…. వెల్లువెత్తుతున్న విమర్శలు?