మేఘా హవాలా ఆపరేషన్‌పై ఆదాబ్‌ హైదరాబాద్‌ సంచలన కథనం

మేఘా హవాలా ఆపరేషన్‌పై ఆదాబ్‌ హైదరాబాద్‌ సంచలన కథనం

మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ తెలుసు కదా.రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నా కూడా.

మేఘా హవాలా ఆపరేషన్‌పై ఆదాబ్‌ హైదరాబాద్‌ సంచలన కథనం

ఆ ఇద్దరికీ బాగా కావాల్సిన వ్యక్తి ఈ మేఘా సంస్థ ఓనర్‌ కృష్ణారెడ్డి.

మేఘా హవాలా ఆపరేషన్‌పై ఆదాబ్‌ హైదరాబాద్‌ సంచలన కథనం

ఇటు తెలంగాణలో కాళేశ్వరం, అటు ఏపీలో పోలవరంలాంటి కీలక ప్రాజెక్టులను చేజిక్కించుకున్నారు.అయితే ఈ మేఘా కృష్ణారెడ్డిపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉండగా.

ఆదాబ్‌ హైదరాబాద్‌ అనే పత్రిక అయితే ఈయన ఏకంగా హవాలా రాకెట్‌ నడిపినట్లు ఓ సంచలన కథనం ప్రచురించింది.

ఎన్నికల సమయంలో పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకోవడానికి కొందరికి మేఘా సహకరించిందన్నది ఆ పత్రిక ఆరోపణ.

సుమారు రూ.3300 కోట్ల బ్లాక్‌మనీని ఇలా వైట్‌గా మార్చారని చెబుతోంది.

ఎన్నికల వేళ పన్నులు ఎగ్గొట్టి నల్లధనాన్ని సమకూర్చుకున్న వారికి మేఘా తన సిండికేట్‌ సంస్థల ద్వారా సహకరించిందని ఆదాబ్‌ హైదరాబాద్‌ ఆరోపిస్తోంది.

V ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2019/12/Aadab-Hyderabad-On-Mega-Engineering-Company-From-Hyderabad-ఆదాబ్‌-హైదరాబాద్‌-సంచలన-కథనం!--jpg"/తన వ్యాపారానికి సహకరించే సిమెంటు, ఐరన్‌ కంపెనీల దగ్గర సదరు వ్యక్తులు భారీగా సిమెంట్, ఐరన్‌ కొన్నట్లు దొంగ బిల్లులు సృష్టించారని, వంద కోట్లకు బిల్లు ఇస్తే ఆ కంపెనీలకు కమీషన్‌ రూపంలో రూ.

2 కోట్లు ఇచ్చారని ఆ పత్రిక వెల్లడించింది.ఈ కమీషన్‌కు కక్కుర్తి పడిన కంపెనీలు ఇలా భారీగా దొంగ బిల్లులు సృష్టించాయి.

ఆ వ్యక్తులు తమ నల్లధనాన్ని తెల్లగా మార్చుకొని పార్టీలకు విరాళాలు ఇచ్చారు.అయితే ఈ విషయం ఐటీ అధికారులకు తెలియడంతో ఇప్పుడా కంపెనీలకు నోటీసులు అందాయి.

ఆ బిల్లులకు 18 శాతం జీఎస్టీ చెల్లించాలన్నది వాటి సారాంశం.అప్పుటు రెండు శాతం కమీషన్‌ కోసం దొంగ బిల్లులు సృష్టిస్తే ఇప్పుడు 18 శాతం జీఎస్టీ చెల్లించుకోవాల్సి వస్తోందని వాళ్లు లబోదిబోమంటున్నట్లు ఆదాబ్‌ హైదరాబాద్‌ పత్రిక తన కథనంలో తెలిపింది.

ఈ హవాలా రాకెట్‌కు కారణమైన మేఘా సంస్థ తప్పించుకోగా.కమీషన్‌ కోసం కక్కుర్తి పడిన కంపెనీలు మాత్రం బకరాలయ్యాయని ఆ పత్రిక చెబుతోంది.

అంతేకాదు వరుసగా ఇలాంటి పరిశోధనాత్మక కథనాలు ప్రచురించనున్నట్లు కూడా ఆ పత్రిక వెల్లడించింది.