Hero Rajasekhar : హీరో రాజశేఖర్ పై ఉన్న కోపంతో సీనియర్ యాక్టర్ ని గన్నుతో కాల్చిన నిర్మాత

ఒక్కోసారి షూటింగ్ లో సరదాగా చేసిన పనులు పెద్ద ప్రమాదాలను సృష్టిస్తాయి.అలాంటి ఒక సంఘటన హీరో రాజశేఖర్( Hero Rajasekhar ) నటించిన నవభారతం సినిమా( Navbharatham Movie ) టైం లో జరిగింది.

ఈ సినిమా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించగా, పోకూరి వెంకటేశ్వర రావు( Pokuri Venkateswara Rao ) నిర్మాతగా వ్యవహరించారు.

ఇక ఈ సినిమాలో నరేష్, పి ఎల్ నారాయణ( Naresh, PL Narayana ) కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.

నిర్మాత పోకూరి వెంకటేశ్వర రావు కి నారాయణ కు మంచి అనుబంధం ఉండేది.

స్వతహాగా మలయాళీ అయినా పి ఎల్ నారాయణ మద్రాసులో స్థిరపడ్డారు.స్టేజి నాటకాల నుంచి పోకూరి వెంకటేశ్వర రావు కి ఆయనకు అనుబంధం ఉండేది.

"""/" / ఎంతలా అంటే ఒకరిని ఒకరు మామ అల్లుడు అని సంబోదించుకునేవారు.

ఇక అసలు విషయం లోకి వెళ్తే సాధారణంగా ఏ సినిమా కు అయినా లేట్ గా షూటింగ్ కి రావడం రాజశేఖర్ కి ఉన్న అలవాటు.

నవభారతం సినిమా టైం లో కూడా అదే జరిగింది.రాజశేఖర్ కోసం అప్పటికే రెండు గంటలకు పైగా లొకేషన్ లో అన్నారు వెయిట్ చేస్తున్న అయన రాలేదు.

అయన ఎప్పుడు వస్తే అప్పుడు మొదలు పెట్టడానికి మిగతా ఆర్టిస్టులు, సినిమా కోసం పని చేసే సిబ్బంది అంత ఎదురు చూస్తున్నారు.

పోకూరి వెంకటేశ్వర రావు కి బాగా టెన్షన్ వచ్చేసింది """/" / ఈ సినిమా లో నరేష్ పోలీస్ గా నటిస్తారు అందుకోసం డమ్మీ బుల్లెట్స్ అండ్ గన్ తెప్పించారు.

సినిమా యూనిట్ లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ పైన్ డమ్మీ గన్ను పెట్టి పి ఎల్ నారాయణ ఎదో ఆట పట్టిస్తున్నారు.

అప్పటికే రాజశేఖర్ వల్ల టెన్షన్ లో ఉన్న నిర్మాత తో సదరు ఆర్టిస్ట్ ఫన్నీ గానే కంప్లైంట్ చేసాడట.

దాంతో ఏంటి మామ నువ్వు .ఏంటి ఈ గోల అని అన్నారట.

అయన చేతిలో ఉన్న గన్ను తీసుకొని నిన్ను కాల్చేస్తే ఈ గొడవ ఉండదు అని సరదాగా అన్నాడట.

నీ చనిపోవడం కన్నా నాకేం కావలి అల్లుడు అంటూ నారాయణ చెప్పడం తో ఆ గన్ను తీసుకొని నారాయణ గొంతు దగ్గర పెట్టి డమ్మీ బుల్లెట్స్ కాబట్టి ఏమి కాదులే అనుకోని కాల్చేశాడట నిర్మాత.

"""/" / కానీ అతి సున్నితమైన శరీర భాగం కావడం తో బాగా ఫోర్స్ గా ఆ డమ్మీ బులెట్ అర అంగుళం లోతుకు వెళ్ళిపోయి కుళాయి తిప్పినట్టు రక్తం వస్తుందట.

అప్పుడే వచ్చిన రాజశేఖర్ డాక్టర్ కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చేసి గుంటూరు ఆసుపత్రికి పంపించారట.

కొన్ని రోజులు ట్రీట్మెంట్ తర్వాత అయన మళ్లి షూటింగ్ కి రావడం ఈ విషయాన్నీ ఎవరు సీరియస్ గా తీసుకోకుండా సరదాగా తీసుకోవడం తో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

నారాయణ కూడా నాకేం కాదులే అల్లుడు అంటూ నవ్వుతూనే ఆసుపత్రికి వెళ్లారట.