పోకిరి రిరిలీజ్.. ఆ డబ్బంతా ఆ చారిటీకే..!

సూపర్ స్టార్ మహేష్ పోకిరి రి రిలీజ్ హంగామా అందరికి తెలిసిందే.పోకిరి సినిమాని ఆగష్టు 9 మహేష్ బర్త్ డే కానుకగా రి రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పోకిరి సినిమా ఆ రోజు ప్రదర్శించబడుతుంది.

ఈ షోకి ఇప్పటికే కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఏర్పాటు చేశారు.చాలా చోట్ల బుకింగ్స్ కూడా ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి.

పోకిరి రి రిలీజ్ ద్వారా వచ్చిన కలక్షన్స్ మొత్తాన్ని ఎంబి ఫౌండేషన్ కి ఇస్తామని మహేష్ ఫ్యాన్స్ ప్రకటించారు.

పూరీ జగన్నాథ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్ని బద్ధలు కొట్టింది.

అప్పటివరకు మాములు హీరోగా ఉన్న మహేష్ ని సూపర్ స్టార్ చేసింది ఈ సినిమా.

సినిమాలో మహేష్ యాక్షన్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనిపించింది.

కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ ఇలా అన్నిటిలో పోకిరి ది బెస్ట్ అనిపించింది.

పూరీ రైటింగ్స్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో పోకిరి ఒకటి.ఈ సినిమాలో గోవా భామ ఇలియానా హీరోయిన్ గా నటించింది.

మణిశర్మ మ్యూజిక్ కూడా పోకిరి సినిమా హిట్ కి ఒక కారణమని చెప్పొచు.

2005 లో పోకిరి రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టించింది.ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత ఆ సినిమా రి రిలీజ్ చేస్తూ మళ్లీ అదే రికార్డులని తిరగ రాయాలని చూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అన్ని మేజర్ సిటీస్ లో పోకిరి షోస్ పడుతున్నాయి.

ఈ షోస్ ద్వారా వచ్చిన కలక్షన్స్ అన్ని ఎంబి ఫౌండేషన్ కి చేరుతాయి.

మహేష్ బాబు ఎంబి ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు హార్ట్ సర్జరీలు ఉచితంగా చేయిస్తున్నారు.

ఇప్పటికే 1200 మంది పిల్లలకు ఆయన ప్రాణదాత అయ్యారని తెలిసిందే.