పాఠశాలలో ఘనంగా పోచమ్మ బోనాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయమైన ఉజ్జయిని మహంకాళి బోనాలు ఈనెల 29 సోమవారం రోజున కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో సాధన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆవరణలో పాఠశాల కరస్పండెంట్ చెన్నమేనేని రాజేశ్వర రావు ఆధ్వర్యంలో శనివారం రోజున పాఠశాలలో మహా ఘనంగా నిర్వహించారు చిన్నారులు వివిధ ఏశాలల్లో వేషాలు కట్టి బోనాల కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కరస్పండెంట్ మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైన బోనాల పండగ సందర్భంగా మా పాఠశాలలో చిన్నారులతో వివిధ వేషాలలో పోతరాజులు వేషాలతో బోనాల పండుగ అనేది ఎలా ఉంటదని చిన్నారులతో తెలిసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇటీ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు, మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు ముందు ముందు కూడా మా పాఠశాలలో వివిధ సాంస్కృతి సాంప్రదాయాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు మరియు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలు.మమత నిత్య శోభా సోనీ ఆదిత్య మానస శిరీష తదితరులు పాల్గొన్నారు.

కీ రోల్స్ పోషిస్తే వచ్చే కిక్కే వేరప్పా అంటున్న సీనియర్ హీరోలు..??