అక్రమంగా ఉండటం తప్పే .. భారతీయుల బహిష్కరణపై మోడీ షాకింగ్ కామెంట్స్
TeluguStop.com
అగ్రరాజ్యం అమెరికాలో( America ) చట్ట విరుద్ధంగా ఉంటున్న పలు దేశాలకు చెందిన వారిని డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ప్రభుత్వం వారి వారి దేశాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో పలువురు భారతీయులు( Indians ) కూడా ఉన్నారు.ఇప్పటికే 104 మందితో కూడిన విమానం ఇటీవల అమృత్‌సర్‌లో దిగింది.
రేపో మాపో మరో రెండు విమానాలలో 200 మంది వరకు భారతీయులను తరలించేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ సర్కార్ తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో భారతీయుల తరలింపుపై కీలక నిర్ణయం వెలువడుతుందని అంతా భావిస్తున్నారు.
ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో మోడీ మాట్లాడుతూ.
చట్ట విరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తామని సంచలన ప్రకటన చేశారు.
పరాయి దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని మోడీ తెలిపారు.
"""/" /
డబ్బు, ఉద్యోగాలు, ఇతర అంశాలను ఆశచూపి కొంత మంది పేదలు, యువతకు మాయ మాటలు చెప్పి అక్రమ వలసదారులుగా( Illegal Immigrants ) మారుస్తున్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే మానవ అక్రమ రవాణా ముఠాలకు చిక్కుతున్నారని .ఇలాంటి వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్న మోడీ ఈ విషయంలో భారత్‌కు అమెరికా అండగా నిలుస్తుందని ఆకాంక్షించారు.
"""/" /
అంతకుముందు అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌లోని వెస్ట్ వింగ్‌కి చేరుకున్న నరేంద్ర మోడీకి.
డొనాల్డ్ ట్రంప్ స్వాగతం పలికి అధికారులు, ఇతర కీలక నేతలను పరిచయం చేశారు.
అనంతరం ట్రంప్ కోసం తీసుకెళ్లిన ప్రత్యేక బహుమతులను మోడీ ఆయనకు అందజేశారు.దీనికి సంబంధించిన ఫోటోలను ప్రధాని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అలాగే డోజ్ చీఫ్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు.
మస్క్ కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక బహుమతులను ఆయన అందజేశారు.