మునుగోడు నిరాశ తీర్చేసిన ప్రధాని ! బీజేపీ లో జోష్ ?

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు , జాతీయ నాయకులు ఆశలు పెట్టుకున్నారు.

మునుగోడు విజయం ద్వారా తెలంగాణలో తాము అధికారంలోకి రాబోతున్నామనే సంకేతాలను జనాల్లోకి పంపించాలని గట్టి ప్రయత్నాలు చేశారు.

అయితే ఊహించని విధంగా టిఆర్ఎస్ మునుగోడులో విజయాన్ని సాధించింది.బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేసినా.

భారీగా సొమ్ములు ఖర్చుపెట్టినా ఫలితం మాత్రం టిఆర్ఎస్ వైపు నిలబడింది.ఇక ఎన్నికల ఫలితం వెలువడిన దగ్గర నుంచి పూర్తిగా బిజెపి క్యాడర్ నిరాశా నిస్పృహల్లో మునిగిపోయాయి.

  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి విజయం పై మునుగోడు ప్రభావం తప్పకుండా ఉంటుందనే టెన్షన్ ఆ పార్టీ నేతల్లో నెలకొన్న సమయంలోనే నిన్న ప్రధాని నరేంద్ర మోది తెలంగాణలో అడుగు పెట్టారు.

రామగుండం ఎరువులు కర్మాగారాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మోది ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై తనదైన శైలిలో విమర్శలు చేశారు.

తెలంగాణలో అవినీతి పాలన, కుటుంబ పాలన అంటూ టిఆర్ఎస్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.

ప్రజలను దోచుకునే వారిని వదిలిపెట్టేది లేదు అంటూ ఆయన చిటికలు వేసి మరి విమర్శలు చేశారు.

ప్రధాని పరోక్షంగా టిఆర్ఎస్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ టిఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పించగా, బీజేపీ నేతల్లో ఉత్సాహం పెంచింది.

తెలంగాణలో ఎన్నికల వాతావరణం ప్రస్తుతం నెలకొంది.మునుగోడు ఉప ఎన్నికలతో అది మరింత రెట్టింపు అయింది.

  """/"/ ముఖ్యంగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాం లో వినిపించిన తర్వాత టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బిజెపి ప్రయత్నించిందనే విమర్శలు, అలాగే ఎన్నికల సమయంలో బిజెపి నుంచి అనేకమంది నాయకులు టిఆర్ఎస్ లో చేరడం ఇవన్నీ తెలంగాణ బిజెపికి తలనొప్పిగా మారాయి.

మునుగోడు ఫలితం బిజెపికి వ్యతిరేకంగా వచ్చిన దగ్గర నుంచి పార్టీ క్యాడర్ లో నిరాశ నిస్పృహలు అలుముకోవడంతో , దానిని తొలగించేందుకు ప్రధాని నరేంద్ర మోది నిన్న చేసిన ప్రసంగం బాగా దోహదపడింది .

మునుగోడు లో ఓటమి చెందినా.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి మరింత బలం పుంజుకుని అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని కలిగించడంలో ప్రధాని నరేంద్ర మోది సక్సెస్ అయ్యారు.

ప్రధాని టూర్ తర్వాత బిజెపి కేడర్ లో ఆ ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.

నయనతార ప్లాస్టిక్ సర్జరీ వార్తల్లో అసలు నిజం ఇదే.. మార్పులకు కారణాలివేనంటూ?