ప్రధాని మోదీ కుటుంబ సభ్యులు ఏం చేస్తుంటారో మీకు తెలుసా?

మీడియా కథనాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ తండ్రి దామోదరదాస్ మోదీకి ఐదుగురు సోదరులు.

వారు.నర్సింగ్ దాస్, నరోత్తం దాస్, జగ్జీవన్ దాస్, కాంతిలాల్, జయంతిలాల్.

కాంతిలాల్, జయంతిలాల్ ఉపాధ్యాయులుగా పదవీ విరమణ చేశారు.జయంతిలాల్ కుమార్తె లీనాబెన్ భర్త విస్‌నగర్‌లో బస్సు కండక్టర్‌గా పనిచేశారు.

నరేంద్ర మోదీ భార్య యశోదాబెన్.ఆమె నుండి మోదీ విడిపోయారు.

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్.ప్రధాని మోదీకి ఒకే ఒక్క సోదరి ఉన్నారు.

ఆమె పేరు వాసంతీబెన్ హస్ముఖ్ లాల్ మోదీ.ఆమె గృహిణి.

ఆమె భర్త పేరు హస్ముఖ్ భాయ్.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నాడు.

ప్రధాని మోదీ సోదరుల విషయానికి వస్తే.అతని పెద్ద సోదరుడి పేరు సోమ మోదీ.

అతను ఆరోగ్య శాఖ నుండి పదవీ విరమణ చేసి అహ్మదాబాద్‌లో వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నారు.

నరేంద్ర మోదీ రెండవ సోదరుని పేరు ప్రహ్లాద్ మోదీ.అతను ప్రధాని మోదీ కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు.

మీడియా నివేదికల ప్రకారం, అతనికి అహ్మదాబాద్‌లో కిరాణా దుకాణం ఉంది.నరేంద్ర మోదీ మూడో సోదరుని పేరు అమృత్ భాయ్ మోదీ.

ఓ ప్రైవేట్ కంపెనీలో ఫిట్టర్‌గా రిటైరయ్యారు.నరేంద్ర మోదీ తమ్ముడు పంకజ్ భాయ్ మోదీ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉంటున్నారు.

సమాచార శాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు.నరేంద్ర మోదీకి వరుసకు సోదరుడైన భరత్‌భాయ్ మోదీ వాద్‌నగర్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఒక సాధారణ పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు.

ప్రధాని మోదీ బంధువులంతా సామాన్యుల మాదిరిగానే జీవనం కొనసాగిస్తున్నారు.

Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీ పొడిగింపు