ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం(Deputy CM Of Andhra Pradesh), ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ (pawan Kalyan)వస్త్రధారణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరదాగా వ్యాఖ్యలు చేశారు.
“మీరు హిమాలయాలకు వెళ్తున్నారా?” అంటూ పవన్‌ను చూసి మోదీ (Modi)ముచ్చటించారు.నేడు ఢిల్లీలో నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ సీఎంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.
వేదికపైకి వచ్చినప్పుడు ఎన్డీఏ(NDA) నేతలందరినీ మోడీ పలకరించారు.పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన వస్త్రధారణలో కనిపించడంతో, ప్రధాని కొద్దిసేపు ఆయనతో సరదాగా మాట్లాడారు.
ఈ విషయంపై మీడియా ప్రతినిధులు పవన్‌ను ప్రశ్నించగా.ఆయన సమాధానమిస్తూ ప్రధాని తరచుగా తనపై జోకులు వేస్తుంటారని తెలిపారు.
ఇవాళ నా వేషధారణ చూసి, హిమాలయాలకు వెళుతున్నావా?" అని మోడీ సరదాగా అడిగినట్లు తెలిపారు.
తాను "అలాంటిదేమీ లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది" అని సమాధానమిచ్చినట్లు చెప్పారు.
ఓవైపు ఈ సరదా సంభాషణ జరగగా.మరోవైపు ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీ(pm Modi) కీలక వ్యాఖ్యలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ సమర్థంగా పోటీ చేస్తుందని, బీహార్, బెంగాల్ (Bihar, Bengal)సహా ఎక్కడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సంఘటనతో పవన్ కల్యాణ్ – ప్రధాని సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"""/" /
నేడు జరిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా రేఖ గుప్తా ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ఎన్డిఏ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ హాజరయ్యారు.అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్డిఏ నేతలు, అలాగే మిత్రపక్ష నేతలు హాజరయ్యారు.
ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రధానోత్సవంలో భాగంగా రేఖ గుప్తాతో పాటు ఆరు మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
వీడియో: ఇది భార్య లేక రాక్షసా.. భర్తను ఇంత ఘోరంగా చితక బాదిందేంటి..