నేడు ఏపీ లో ప్రధాని మోదీ ఎన్నికల టూర్ .. షెడ్యూల్ ఇదే

రసవత్తరంగా సాగబోతున్న ఏపీ ఎన్నికల్లో విజయం సాదించేందుకు వైసిపి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.

ఒంటరిగా ఎన్నికలకు ఆ పార్టీ వెళ్తూ ఉండగా, టిడిపి, జనసేన, బిజెపిలు(TDP, Janasena, BJP) కూటమిగా ఏర్పడి వైసిపిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

దీనిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ఈ రోజు ఏపీలో పర్యటించేందుకు వస్తున్నారు.

రాజమండ్రి, అనకాపల్లి లో (Anakapalli, Rajahmundry)నిర్వహించే బహిరంగ సభ, రోడ్డు షోలలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు.

ఈరోజు, అలాగే 8వ తేదీన కూటమి తరఫున ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

ఎన్నికల ప్రచారం ముగింపు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, కూటమిని గెలిపించాల్సిన ఆవశ్యకతను గురించి ప్రధాని మోదీ ప్రజలకు వివరించనున్నారు.

ప్రధాని మోదీ సభలతో కూటమి పార్టీలకు మరింత ఆదరణ పెరుగుతుందని ఆ పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు .

ప్రధాని సభలో జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసే అవకాశం ఉన్నట్లుగా అంతా అంచనా వేస్తున్నారు.

మే 8న రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలోని పీలేరులో నిర్వహించే సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు.

"""/" / అదేరోజు సాయంత్రం విజయవాడలో నిర్వహించే రోడ్డు షో లోను ప్రధాని పాల్గొనే విధంగా షెడ్యూల్ రూపొందించారు.

ప్రధాని మోదీ షెడ్యూల్ ను ఒకసారి పరిశీలిస్తే.ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి కి ప్రధాని మోదీ రానున్నారు.

అక్కడ నుంచి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు(chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pavan Kalyan), ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరితో(Purandareshwari) కలిసి రాజమండ్రి రూరల్ లోని వేమగిరి సభ ప్రాంగణానికి ఆయన చేరుకుంటారు.

అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరి తో పాటు, కూటమికి చెందిన అభ్యర్థుల ను గెలిపించాల్సిందిగా ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు.

"""/" / రాజమండ్రి రూరల్ వేమగిరిలో జరిగే సభకు బిజెపి(BJP) భారీగా ఏర్పాట్లు చేసింది.

ప్రధాని భద్రత కోసం భారీగా పోలీసులను మోహరించారు.భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు.

రాజమండ్రిలో సభ ముగించుకుని సాయంత్రం 5.45 గంటలకు ప్రధాని విశాఖ ఎయిర్ పోర్ట్ కు ప్రధాని చేరుకుంటారు.

ఆ తరువాత అనకాపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ,ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

ఈనెల 8న మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు.పీలేరు అసెంబ్లీ పరిధిలోని కలికిరి సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి పాల్గొంటారు.

సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ చేరుకుని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్డు షో లో ప్రధాని పాల్గొంటారు.

ఎన్ని కోట్లు ఇచ్చిన ఈ హీరో హీరోయిన్స్ ఇకపై కలిసి నటించే అవకాశం లేదు !