ఏపీకి ప్రధాని మోది .. ఎన్నికల టూర్ ప్లాన్ ఇలా

ఏపీలో బిజెపి( BJP ) ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడంతో టిడిపి, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తుంది.

10 అసెంబ్లీ ,ఆరు లోక్ సభ స్థానాల్లో బిజెపి పోటీ చేస్తుంది.అయితే టిడిపి, జనసేనలు ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా ఉండడం, బిజెపి పెద్దలు ఎవరూ ఏపీ పర్యటనకు రాకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తితోనే ఉంటున్నారు.

ఒక దశలో ఆయన బిజెపితో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామా అనే ధోరణికి వచ్చారు.

దీనికి కారణం తమతో పొత్తులో ఉన్న బిజెపితో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉండడం, పరోక్షంగా వైసీపీకి సహకారం అందిస్తోంది అనే అనుమానం టిడిపి( TDP ) శ్రేణుల్లో కలగడం తదితర కారణాలతో పొత్తు ఉన్నా.

ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది.మరోవైపు చూస్తే తెలంగాణలో బిజెపి అగ్ర నేతలు వరుసగా పర్యటిస్తున్నారు.

17 లోక్ సభ స్థానాలు తెలంగాణలో ఉండడంతో, అక్కడ ఎక్కువ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

"""/" / కానీ ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉన్నా.ఆరు స్థానాల్లో బిజెపి పోటీ చేస్తున్నా .

పెద్దగా పట్టించుకోన్నట్టుగా వ్యవహరించడం, బిజెపి అగ్ర నేతలు ఎవరు ఏపీ పర్యటనకు రాకపోవడం పై కూటమి పార్టీలో అసంతృప్తి నెలకొంది.

అయితే తాజాగా ఏపీ టూర్ ( AP Tour )కు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యింది.

ఈనెల 7 , 8 తేదీలలో రోడ్డు షో, సభలు నిర్వహించనున్నారు.రాజమహేంద్రవరంలో పురందరేశ్వరి( Daggubati Purandeswari )కి మద్దతుగా 7 న సాయంత్రం 3.

30 గంటలకు వేమగిరిలో నిర్వహించే సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. """/" / సాయంత్రం 5.

45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో ప్రధాని పాల్గొననున్నారు.రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించనున్నట్లు బిజెపి వర్గాలు పేర్కొన్నాయి.

ప్రధాని ఏపీ టూర్ షెడ్యూల్ ఖరారు కహావడంపై అటు టీడీపీ ఇటు జనసేన వర్గాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

వైరల్ వీడియో: చీర కట్టి దివ్యంగుల నిరసన.. ఎందుకంటే?