ఏపీకి ప్రధాని మోదీ ..  ఎప్పుడు ఎందుకు ? 

బిజెపి( BJP ) కీలక నేత , భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) ఏపీ టూర్ ఖరారు అయింది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తమ్మిన పట్నం గ్రామానికి ప్రధాని నరేంద్ర మోది రానున్నారు.

ఈనెల ఆరో తేదీన అక్కడ ప్రధాని పర్యటిస్తారు.కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

ఈ కార్యక్రమానికి అనేకమంది కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.  ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం రావడంతో ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు మొదలుపెట్టారు.

కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో వివిధ పరిశ్రమలు,  ఇతర అవసరాల కోసం 20వేల ఎకరాల భూమిని గతంలోనే సేకరించారు.

"""/" / ప్రస్తుతం కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ( Krishnapatnam Industrial)కోసం 12500 ఎకరాలను కేటాయించారు.

ఈ పరిధిలో ఎగుమతి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పరిశ్రమలకు అనుబంధంగా చిన్న పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు అవుతాయని భావిస్తోంది.

క్రిస్ సిటీ కోసం సహకరించిన భూములలో మౌలిక సదుపాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కల్పిస్తాయి.

సాగరమాల పథకం కింద ఇప్పటికి సముద్రపు తీర ప్రాంతంలో రహదారి నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది .

వీటి పనులు వేగంగానే జరుగుతున్నాయి.కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉండడంతో ఎగుమతులు దిగుమతులకు సౌకర్యంగా ఉంటుందని భావించే ఈ ప్రాంతంలో పారిశ్రామిక సెజ్ ను ఏర్పాటు చేస్తున్నారు.

"""/" / ఈసెజ్ వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.

  ప్రధాని నరేంద్ర మోది స్వయంగా ఇక్కడకు వస్తుండడంతో ముందస్తుగా అన్ని భద్రత ఏర్పాట్లను అధికారులు మొదలుపెట్టారు.

అలాగే ఏపీకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులో విషయం పైన ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) ఈ పర్యటనలోను చర్చించనున్నట్టు సమాచారం.

దేవర సెప్పినాడంటే చేస్తాడని.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమాల్లో నటిస్తున్నాడుగా!