ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన ఘనత

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలం పాటు కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే.

మొదటి ప్రధాని నెహ్రూ నుండి మన్మోహన్‌ సింగ్‌ వరకు ఎంతో మంది కాంగ్రెస్‌ ప్రధాన మంత్రులు దేశాన్ని పరిపాలించారు.

అయితే మద్యలో కొందరు పీఎంలు వచ్చినా కూడా ఎక్కువ కాలం ప్రధానులుగా నిలిచింది.

లేదు.ఇన్నేళ్ల స్వాతంత్య్ర భారతంలో కాంగ్రేసేతర ప్రధానిగా అటల్‌ బీహార్‌ వాజ్‌ పేయి అత్యధిక కాలం పదవిలో కొనసాగారు.

ఆయన 6 సంవత్సరాల 2 నెలల 2 రెండు వారాల 3 రోజులు.

అంటే ఆయన 2268 రోజుల పాటు ప్రధానిగా ఉన్నారు.అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రేసేతర ప్రధానిగా వాజ్‌పేయి రికార్డును నేటితో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ బ్రేక్‌ చేశారు.

కాంగ్రెస్‌ ప్రధాన మంత్రులు సుదీర్ఘ కాలం ప్రధానులుగా పని చేసిన రికార్డు ఉంది.

కాని కాంగ్రెసేతర ప్రధానులు మాత్రం ఇంత కాలం ప్రధానులుగా కంటిన్యూగా పీఎంఓ ఆఫీస్‌ ను అంటిపెట్టుకుని ఉండటం అరుదు.

ఆ అరుదైన రికార్డును మోడీ దక్కించుకున్నారు.మరో నాలుగు సంవత్సరాల పాటు కూడా ఆయనే ప్రధానిగా ఉండనున్నారు.

కనుక ఆ రికార్డు మరింత పదింగా ఉండనుంది.2024లో ఎన్నికల్లో ఫలితాన్ని బట్టి మోడీ సరికొత్త రికార్డును నమోదు చేసే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు.

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పరిశీలనకు చీఫ్ ఇంజనీరింగ్ బృందం..!!