ప్రధాని మోడీ కొత్త స్కీమ్.. పేదలకు మరో తీపి కబురు.. ఈ స్కీం ద్వారా సులభంగా రుణాలు…

భారతదేశంలోని పేదలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సరికొత్త స్కీంను ప్రవేశపెట్టారు.ఈ స్కీమును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు నుండే ప్రారంభించడం శుభదాయకం.

దేశవ్యాప్తంగా గ్రామాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు భూ యాజమాన్య పత్రాలను అందించనున్నారు.డ్రోన్స్ ద్వారా ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్ల పంపిణీ జరగనుంది.

భూ వివాదాలకు స్వస్తి పలకడం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాపర్టీ హక్కు కల్పించడం వంటివి ఈ స్కీం ముఖ్య ఉద్దేశాలు.

దేశవ్యాప్తంగా 763 గ్రామంలో దాదాపు 1,32,000 మందికి ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్లు అందించనున్నారు.

ఈ డాక్యుమెంట్లను తనఖా పెట్టి బ్యాంకులో రుణాలు పొందే అవకాశం కూడా ఉండడం పేదలకు గొప్ప వరం.

అంటే ఇళ్లపై కూడా లోన్ పొందవచ్చు.దీంతో చాలామందికి ఆర్థిక స్వావలంబన కలగనుంది.

స్వమిత్వా స్కీం క్రింద ప్రధాని మోడీ ప్రాపర్టీ డాక్యుమెంట్లను అందించనున్నారు.హర్యానాలోని 221 గ్రామాలు, మహారాష్ట్రలో 100 గ్రామాల్లో, ఉత్తరప్రదేశ్లో 346 గ్రామాల్లో, ఉత్తరాఖండ్లో లో 50 గ్రామాల్లో, మధ్యప్రదేశ్ లో 44 గ్రామాల్లో, కర్ణాటకలో 2 గ్రామాల్లో డాక్యుమెంట్ల పంపిణీ జరగనున్నది.

వీరందరికీ డిజిటల్ ప్రాపర్టీ కార్డులు కూడా లభిస్తాయి.కానీ మన తెలుగు రాష్ట్రాలకు ఈ జాబితాలో అవకాశం లేకపోవడం గమనార్హం.

లబ్ధిదారులు మొబైల్ ఫోన్లకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది.అందులో లింక్ ఉంటుంది.

దీని పై క్లిక్ చేసి డిజిటల్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ఉదయం 11 గంటలకు ఈ స్కీమ్ ద్వారా డిజిటల్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నారు.

నాన్నను అలా చూడటం నాకు ఇప్పటికీ గుర్తుంది.. మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్ వైరల్!