గాన కోకిల లతా మంగేష్కర్ మృతిపై ప్రధాని మోడీ సంతాపం..

ఇండియా లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఈ రోజు తుది శ్వాస విడిచారు.

ఈమె గత కొన్ని రోజులుగా కరోనా వ్యాధితో బాధ పడుతున్నారు.ఈమె భారత దేశం మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగింది.

ఇంతటి మహనీయమైన గానకోకికిల గాత్రం మూగబోవడంతో ఆమె అభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు.

ఈమె మరణ వార్తను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

దీంతో ఈ వార్త విన్నీ యావత్ సంగీత ప్రియుల గొంతు కూడా మూగబోతున్నాయి.

ఈమెకు కన్నీళ్లతో నివాళులు అర్పిస్తున్నారు.లతా మంగేష్కర్ కు 92 ఏళ్ళు.

ఈమె జనవరి 11న కరోనా వ్యాధితో ముంబై లోని బ్రీచ్ క్యాడీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.

ఈమె కరోనా వ్యాధి మాత్రమే కాదు న్యుమోనియా వ్యాధితో కూడా బాధ పడుతున్నారు.

ఈమె ఆరోగ్యం జనవరి నెలాఖరులో కోలుకుంటున్నట్టు ఆసుపత్రి అధికారులు చెప్పారు. """/"/ అయితే ఉన్నట్టుండి లతా మంగేష్కర్ ఆరోగ్యం నిన్న శనివారం సీరియస్ అయ్యింది.

దీంతో ఈమెకు వైద్యులు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు.కానీ ఈమె ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు.

తాజాగా ఈమె మరణ వార్త విన్న ప్రధాని లతా మంగేష్కర్ కు సంతాపం తెలిపారు.

"""/"/ ''నేను చెప్పేలేనంత వేదనలో ఉన్నాను.దయ, శ్రద్ధ గల లతా దీదీ మమ్మల్ని విడిచి పెట్టారు.

ఆమె మన దేశంలో పూరించలేని శున్యాన్ని మిగిల్చింది.రాబోయే తారలు ఆమెను భారతీయ సంస్కృతికి మారుపేరుగా గుర్తుంటుంది.

ఆమె మధురమైన స్వరం ప్రజలను మంత్రముగ్దులను చేసింది.లతా దీదీ పాటలు రకరకాల ఎమోషన్స్ ను తీసుకొచ్చాయి.

ఆమె దశాబ్దాలుగా చలనచిత్ర ప్రపంచ మార్పులను దగ్గరగా చూసింది.సినిమాలకు అతీతంగా ఆమె భారతదేశం అభివృద్ధిపై ఎప్పుడు మక్కువ చూపేది.

ఆమెతో నా పరిచయం మరువలేనిది.లతా దీదీ మరణం నాకు బాధను కలిగించింది.

ఓం శాంతి.అంటూ ట్వీట్ ముగించాడు మోడీ.

తండేల్ క్లైమాక్స్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారా..?