వెహికల్ స్క్రాపింగ్‌తో మీరూ లబ్ధి పొందే అవకాశం!
TeluguStop.com
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (నేడు) కొత్త వెహికల్ పాలసీ చట్టాన్ని ప్రకటించారు.
ఇది భారతదేశ అభివృద్ధికి కీలకంగా పనిచేస్తుందని ట్వీటర్ వేధికగా ఆయన తెలిపారు.స్టార్టప్ కంపెనీలు కూడా ఇందులో భాగం కావచ్చని చెప్పారు.
దీంతో యువతకు ఉద్యోగ కల్పనకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.గుజరాత్‌లోని పెట్టుబడిదారుల సమావేశంలో ఈ పాలసీని ప్రకటించారు మోడీ.
యువతను కూడా ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.అలాగే వెహికల్ స్క్రాపింగ్‌తో వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని చెప్పారు.
ఉద్యోగాల కల్పనతోపాటు కొత్త వాహనాలకు డిమాండ్ కూడా పెరుగుతుంది.h3 Class=subheader-styleస్క్రాపేజీ పాలసీపై పీఎం అభిప్రాయం.
/h3p
ప్రధాని నరేంద్ర మోడీ ఈ పాలసీని ‘ వేస్ట్ టూ వెల్త్’ మిషన్ అని పేర్కొన్నారు.
ఇది దేశీయ ఆటోరంగానికి మంచి గుర్తింపును తీసుకువస్తుందన్నారు.ఈ నయా పాలసీతో అన్‌ఫిట్ (ఫిట్‌నెస్ తక్కువ) వాహనాలను తగ్గించవచ్చు.
ఆటోరంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా దీని ద్వారా లబ్ధి పొందనున్నారని చెప్పారు.
అంతేకాదు ఈ పాలసీ సర్క్యూలర్ ఎకానమీలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ప్రధాన నగరాల్లో ఉండే కాలుష్యాన్ని తగ్గించి, తక్షణ అభివృద్ధికి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.
దీంతో రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకువస్తుంది.
తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. """/"/
H3 Class=subheader-styleసామాన్యులకు 5 బెనిఫిట్స్.
/h3p
– మీ పాత కారును స్క్రాపింగ్ చేసినపుడు ఓ సర్టిఫికేట్‌ను ఇస్తారు.దీంతో మీరు కొత్త కారును తీసుకునేటపుడు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాల్సిన అవసరముండదు.
– అంతేకాదు, వెహికల్ ఓనర్‌కు ఇతర ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి.పాత వాహనంపై ఇన్సెంటివ్, రోడ్డు ట్యాక్స్‌పై డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది.
– దీంతో ఆ వ్యక్తికి నిర్వహణ ఖర్చు తగ్గుతుంది.రిపెయిర్, ఇంధనం ఖర్చు కూడా తగ్గుతుంది.
– వాహన యజమానులకు మంచి ధరకు పాత వాహనాల పార్ట్స్‌ను కొనుక్కుంటారు.టైర్స్ వంటివి.
– కొత్త అడ్వాన్స్›్డ వాహనాలతో ఎక్కువ లాభాలు ఉంటాయి.అంటే కొత్త కార్లకు అధిక ఫీచర్స్ ఉంటాయి.
దీంతో మీకు భద్రత కూడా ఇస్తుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్27, శుక్రవారం 2024