అమెరికా ఆంక్షలను ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆ దేశ ప్రధాని..

అమెరికా దిగ్బంధనానికి ముగింపు పలకాలని బుధవారం రోజు క్యూబా దేశ ప్రధాని డికాన్ మిచెల్ పిలుపునిచ్చారు.

క్యూబా విప్లవాత్మక మార్పులను అణిచివేయాలనే ఉద్దేశంతో క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య, ద్రవ్య నిర్బంధాన్ని ఎత్తివేయాలని ఈ సందర్భంగా ప్రధాని వెల్లడించారు.

బాలివియాన్ ఆలయాన్స్ ఫర్ ది పీపుల్స్ ఆఫ్ అవర్ అమెరికా పీపుల్స్ ట్రేడ్ అగ్రిమెంట్ వార్షికోత్సవం సందర్భంగా క్యూబా పార్లమెంట్లో ప్రధాని మాట్లాడారు.

అంతేకాకుండా అమెరికా దిగ్బంధాన్ని తిప్పుకొట్టేందుకు సమిష్టిగా ప్రయత్నించాలని ఆయన చెప్పారు.అమెరికా ఏకపక్షంగా ఉగ్రవాద దేశాల జాబితాలో క్యూబాను చేర్చడాన్ని ఆయన తప్పు పట్టారు.

అంతే కాకుండా వెనిజులాపై ఆంక్షలు విధించడానికి ఆయన వ్యతిరేకించారు.తమ దేశానికి అందిస్తున్న సంఘీభావానికి, ముఖ్యంగా కరోనా మహమ్మారి వ్యతిరేక పోరాటానికి అందించిన సహకారానికి ఆదేశాలకు ప్రధాని కృతజ్ఞత తెలిపారు.

పర్యావరణ మార్పుల ప్రమాదాలపై కరేబియన్ దేశాలను ఆయన హెచ్చరించారు.ఎందుకంటే తుఫానులు కొన్ని గంటల వ్యవధిలో కొన్నేళ్ళ అభివృద్ధిని నాశనం చేయగలవని ఆయన హెచ్చరించారు.

"""/"/ పర్యావరణ మార్పులకు అభివృద్ధి చెందుతున్న దేశాలను జాబుదారీగా ఉంచడానికి కరేబియన్ దేశాలకు నష్టాలను భర్తీ చేయడానికి సహకారం అందించాల్సిందిగా సూచించిన ఏ ఎల్ బి ఏ - టిసిపికి కృతజ్ఞత కూడా తెలిపారు.

అయితే ఇది కరేబియన్ దేశాలకే కాకుండా ఇతర దేశాల పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంలో పేర్కొన్నారు.

ఇటీవల క్యూబా నికర గువాలో తుఫానులు, వెనిజులా బిలీవియాలో వరదలు దీనికి నిదర్శమని ఆయన చెప్పారు.

ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశాలు ప్రాంతీయ ఐక్యత స్వీయ నిర్ణయాధికారం సార్వ భౌమాధికారం సాధించాలని ఆయన వెల్లడించారు.

ఉద్యోగులు, నిరుద్యోగులకు చంద్రబాబు సంచలన హామీలు..!!