త్రిబుల్ ఆర్, రాదే శ్యామ్ తో పోలిస్తే.. పవన్ భీమ్లా నాయక్ కే ఎక్కువ ప్లస్ పాయింట్లు ఉన్నాయా?

ఈ సమ్మర్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు కరోనా వైరస్ పేరుతో పట్టిన దుమ్ముదులిపేందుకు స్టార్ హీరోలందరూ కూడా సిద్ధమైపోయారు.

ఈ క్రమంలోనే వరుసగా సినిమాలను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.కేవలం నెల రోజుల గ్యాప్ లోనే భారీ సినిమాలు విడుదల అవుతూ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

విడుదలకు సిద్దంగా ఉన్న అన్ని సినిమాలు ఒకదానికి మించి ఒకటి అనే విధంగా రికార్డులు క్రియేట్ చేసే విధంగానే కనిపిస్తాయి.

ముఖ్యంగా అందరి కంటే ముందు అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు.

ఇక ఆ తర్వాత రాధేశ్యామ్ తర్వాత త్రిబుల్ ఆర్ లాంటి భారీ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.

కాగా మొత్తం ఈ సినిమాల బడ్జెట్1,100 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పాలి.

అయితే ఇక వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నా సినిమాలతో ఉన్న మైనస్ లను పోల్చి చూస్తే ఇక భీమానాయక్ ప్లస్ పాయింట్లు ఏంటో తెలుసుకుందాం.

పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా త్రిబుల్ ఆర్.

సినిమాకు ఉన్న బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్టీఆర్ చరణ్ లాంటి స్టార్ హీరోలు ఉండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమా మ్యూజిక్ మాత్రం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోకపోవడం గమనార్హం.ఇక అంతే కాకుండా ఈ సినిమా ద్వారా జక్కన్న చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.

"""/"/ ఇక ప్రభాస్ పూజ హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రాధేశ్యామ్.

ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక లవ్ స్టోరీ వరకు ఓకే కానీ ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లేదు అన్న టాక్ వుంది.

ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇక ఇది సినిమాకు ఇది మైనస్ గా మారే అవకాశం ఉంది అన్నది ప్రస్తుతం అందరూ అనుకుంటున్న మాట.

ఇక ప్రభాస్ అంటే యాక్షన్ ఉండాలి అని ఎక్స్పెక్ట్చూసే అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు.

"""/"/ చివరగా భీమ్లా నాయక్ విషయానికి వస్తే.బెంగాల్ టైగర్స్ లాంటి ఇద్దరు హీరోలు రాణా, పవన్ కళ్యాణ్ లు కలిసి నటిస్తున్నారు.

ఇద్దరు పవర్ఫుల్ హీరోలే.ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి జీవించగలరు.

పైగా మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ భీమ్లా నాయక్.ఈ సినిమాలో లవ్ స్టోరీ సెంటిమెంట్ అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మ్యూజిక్ కూడా ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తుంది అన్న విషయం తెలిసిందే.

దీంతో ఇక రాధేశ్యామ్, త్రిబుల్ ఆర్ సినిమా లతో పోల్చి చూస్తే అటు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూ ఎక్కువ ప్లస్ పాయింట్లు ఉన్నాయి అన్నది తెలుస్తోంది.

ఛీ.. ఛీ.. రీల్స్ కోసం అన్న శవాన్ని వదలని చెల్లెలు!