న‌డి స‌ముద్రంలో క్రికెట్ ఆడేశారు.. ఎలాగో తెలుసా

క్రికెట్ పేరు వింటేనే పూన‌కాలు వచ్చిన‌ట్టు ఊగిపోతుంటారు అభిమానులు.మ‌న దేశంలో దీని వేవ్ చాలా ఎక్కువ‌గా ఉంటుంది.

ఇక క్రికెట్ అనే మాట‌కు వ‌స్తే ఐపీఎల్ లాంటి పొట్టి ఫార్మాట్ మ్యాచుల‌కు ఉన్న క్రేజ్ వేరే లెవ‌ల్‌.

అందుకే దీనికి విప‌రీతంగా అభిమానులు ఉన్నారు.మొన్న‌టి దాకా మ‌న దేశంలో ఈ ఐపీఎల్ ఎంత‌లా ఎంట‌ర్ టైన్ చేసిందో చూశాం.

ఇందులో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆల్ టైమ్ ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగి ఈ సారి చాంఫియ‌న్స్‌గా నిలిచింది.

అయితే ఫైనల్ మ్యాచ్ సంద‌ర్భంగా చాలామంది చాలా ర‌కాలుగా ధోనీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఈ క్ర‌మంలో చాలా మంది లాగే కొంద‌రు బెట్టింగులు కూడా కాస్తుంటారు.కానీ కొంద‌రు మాత్రం చెన్నై టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పేందుకు స్కూబా డ్రైవర్లు చేసిన సాహసం ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారింది.

స్కూబా డ్రైవ‌ర్లు అంటేనే స‌ముద్రంలో విన్యాసాలు చేస్తుంటారు.కానీ వారు ఈసారి వెరైటీగా చెన్నై జట్టు గెలుపునుకోరుతూ నడిసముద్రంలో క్రికెట్ ఆడేశారు.

ఇదేంటి న‌డి స‌ముద్రంలో ఎలా ఆడుతారు అనే క‌దా మీ డౌటు.అదే మ‌రి మ్యాజిక్ అంటే.

వారు నీటిలోనే బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

"""/"/ విష‌యంలోకి వెళ్తే మ‌న ప‌క్క‌నే ఉండే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి కొంద‌రు ఈ ఫీట్ చేశారు.

టెంపుల్ అట్ వెంచర్స్ అనే టైటిల్ మీద అరవింద్ అండ్ టీం మెంబ‌ర్లు ఈ విధంగా స‌ముద్రంలోకి వెళ్లి మ‌రీ క్రికెట్ ఆడారు.

వారు నీటిలోకి ఏకంగా స్టంపులతో పాటుగా బాల్ ను కూడా తీసుకెళ్లి మ‌రీ క్రికెట‌ర్ ఆడేశారు.

ఇంకో విశేషం ఏంటంటే ఇలా స‌ముద్రంలో ఆడిన వారంతా కూడా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని వేసుకునే క్రికెట్ ఆడేశారు.

ఇది చూసిన చెన్నై ఫ్యాన్స్ తెగ కుషీ అవుతున్నారు.మ‌రి లేటెందుకు మీరు కూడా చూసేయండి.

నేటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర