వరిలో ఉల్లికోడు పురుగులను నివారించే సస్యరక్షక పద్ధతులు..!

వరి పంట( Rice Crop ) రెండు తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది.

గత కొన్ని సంవత్సరాలుగా వరి పంట కు ఉల్లికోడు సమస్య కారణంగా పంట దిగుబడి తగ్గుతుంది.

ఉల్లికోడు యాజమాన్యం పై రైతులు( Farmers ) అవగాహన కల్పించుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.

ఉల్లికోడు పురుగు దోమ ఆకారంలో ఉంటుంది.ఆడ పురుగులు లేత ఎరుపు రంగులో, మగ పురుగులు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.

తల్లి పురుగులు పెట్టిన గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకు పొరల్లోకి చోచ్చుకుపోయి కణజాలాన్ని తింటూ జీవిస్తాయి.

"""/" / తొలకరి వర్షాలు పైన తర్వాత ఈ ఉల్లికోడు తల్లి పురుగులు పొలం చుట్టూ ఉండే కలుపు మొక్కలను ఆశిస్తాయి.

ఆ తర్వాత నాట్లు వేశాక వరి పంటను ఆశిస్తాయి.ఒక యొక్క అంకురంలోకి సెసిడోజిన్ అనే రసాయనాన్ని చొప్పించడం వల్ల వరి కంకులు ఏర్పడవు.

ఈ పురుగులు నారుమడి దశ నుండి పిలక దశ వరకు మాత్రమే వరి పంటను ఆశిస్తాయి.

పొలం చుట్టూ ఉన్న గడ్డి జాతి కలుపు మొక్కలను నాశనం చేయడం ద్వారా వరి పంటను ఈ పురుగులు ఆశించకుండా నివారించవచ్చు.

"""/" / ఉల్లికోడు పురుగులను తట్టుకునే రకాలైన కాకతీయ, సురేఖ, ఎర్రమల్లెలు, కావ్య, పోతన శ్రీకాకుళం సున్నాలు వంటి రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.

ఉల్లికోడును సమర్థవంతంగా నియంత్రించే ప్లాటిగాస్టర్ ఒరైజే అనే పరాన్న జీవులు పొలంలో కనిపిస్తే తాత్కాలికంగా పురుగు మందుల పిచికారి ఆపేయాలి నారుమడిలో నారు మొలకెత్తిన 15 రోజులకు ఒక సెంటు నారుమడిలో 160 గ్రాముల చొప్పున కార్బో ప్యూరాన్ 3జి( Carbo Puron 3g ) ను పలుచగా నీరు పెట్టి పొలంలో చల్లి ఆ నీరు బయటకు పోకుండా కంతలు కట్టి వేయాలి.

ఇలా చేస్తే పురుగులు పంటను ఆశించకుండా చేయవచ్చు.

చిన్న సీన్ల కోసం ఎక్కువ టేక్స్‌ తీసుకున్న టాలీవుడ్ యాక్టర్స్ వీళ్లే..??