ఉల్లి సాగులో పేను బంకను అరికట్టే సస్యరక్షక పద్ధతులు..!

ఉల్లి పంటకు( Onion Crop ) తీవ్ర నష్టం కలిగించే వాటిలో పెనుబంకా పురుగులు కీలక పాత్ర పోషిస్తాయి.

ఈ పెనుబంక పురుగులను తొలి దశలోనే అరికట్టాలి లేదంటే జరిగే నష్టం ఊహించని రీతిలో ఉంటుంది.

ఈ పెనుబంక పురుగులు చాలా చిన్నగా ఉండి మృదువైన శరీరంలో కలిగి ఉంటాయి.

పెనుబంకా పురుగులు సున్న పాయింట్ ఐదు నుండి రెండు మిల్లీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి.

ఇవి జాతిని బట్టి పసుపు, గోధుమ, ఎరుపు, నలుపు రంగులలో ఉంటాయి.ఇవి లేత ఆకుల కణజాలా లను ఆశించి పూర్తిగా తినేస్తాయి.

ఈ పెనుబంక పురుగులు( Gummy Worms ) అనేక జాతులకు, మొక్కల వైరస్లకు ఇవి వాహకాలుగా ఉంటాయి.

కాబట్టి ఈ పురుగులతో నష్టమే కాదు ఈ పురుగుల వల్ల అనేక రకాల తెగుళ్లు పంటను ఆశించే అవకాశం ఉంది.

"""/" / ఈ పురుగుల వల్ల ఉత్పత్తి అయ్యే తేనె వంటి బంక ఒక ఫంగస్.

ఈ ఫంగస్ ( Fungus )వివిధ రకాల తెగులు వ్యాపించడానికి దోహదపడుతుంది.కీటకాలు ఒక మొక్క నుండి మరొక మొక్కకు వెళ్లడానికి ఇవి సహాయంగా ఉంటాయి.

ఈ పెనుబంకా పురుగులు ఉల్లి పంటను ఆశించకుండా ఉండడం కోసం పొలం చుట్టూ అధిక సంఖ్యలో వివిధ రకాల మొక్కలను పెంచడం, పెనుబంక ఆశించిన మొక్కలను వెంటనే పంట నుండి వేరు చేసేయాలి.

ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలు పొలంలో లేకుండా పూర్తిగా తొలగించాలి.ఎప్పటికప్పుడు కలుపును నివారించాలి.

జిగురు పట్టీలను ఉపయోగించి ఈ పెనుబంక పురుగులను రక్షించే చీమల జనాభాను నియంత్రించాలి.

"""/" / సేంద్రీయ పద్ధతిలో ఈ పురుగులను అరికట్టాలంటే లేడీ బగ్స్, అల్లిక రెక్కల పురుగులు, సోల్జర్ బీటిల్స్ లాంటిది ఉపయోగించి ఈ పురుగులను అరికట్టవచ్చు.

మూడు మిల్లీమీటర్ల వేప నూనెను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేస్తే ఈ పెనుబంక పురుగులను అరికట్టవచ్చు.

రసాయన పద్ధతిలో ఫిప్రోనిల్ 2మి.లీ లేదా థియామెథోక్సమ్ 0.

2గ్రా ను ఒక లీటరు నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.

మిస్టర్ బచ్చన్ – డబుల్ ఇస్మార్ట్: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్.. నెగ్గేదెవరు..??