మునుగొడులో భారీ బహిరంగ సభకు ప్లాన్-ప్రియాంకా గాంధీ హాజరు!

నల్లగొండ/హైదరాబాద్:తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్‌ పీక్స్‌కు చేరుకున్నాయి.ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడక ముందే రాజకీయ పార్టీలు మునుగోడుకు క్యూ కడుతున్నాయి.

మునుగోడులో బహిరంగ సభలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి.

ఇప్పటికే టీఆర్‌ఎస్‌,బీజేపీ భారీ బహిరంగ సభలు నిర్వహించగా కాంగ్రెస్‌ సైతం మునుగోడులో సభకు ప్లాన్‌ చేస్తోంది.

ఇందులో భాగంగానే సెప్టెంబర్‌ తొలి వారంలో మునుగోడులో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తోంది.

కాగా,కాంగ్రెస్‌ మునుగోడు సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ విచ్చేస్తున్నారు.

ఇక,తెలంగాణకు ప్రియాంక గాంధీ రానున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ కేడర్‌లో కొంత జోష్‌ వస్తుందని అధిష్టానం భావిస్తోంది.

మరోవైపు ఇప్పటికే మునుగోడులో టీఆర్‌ఎస్‌ ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.

ఈ సభలో బీజేపీపై కేసీఆర్‌ విరుచుకుపడ్డారు.ఇక,ఆదివారం జరిగిన బీజేపీ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా విచ్చేశారు.

బీజేపీ సభలో అమిత్‌ షా కేసీఆర్‌ కుటుంబ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజగోపాల్‌ రెడ్డిని గెలిపిస్తే తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలనపై కనుమరుగవుతుందని వ్యాఖ్యలు చేశారు.

ఈ తరుణంలో కాంగ్రేస్ కూడా జాతీయ స్థాయి నేతను రప్పించి,తామేమీ తక్కువ కాదనే సంకేతాలు ఇచ్చేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే కథల్లో ఇవీ ఉండకూడదా..?