ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ పెట్టాడు... కానీ ఊహించనిది డెలివరీ అయ్యింది!

ఈమధ్య ఓ ఆన్లైన్ ప్లేట్ ఫామ్ 'బిగ్ బిలియన్ సేల్' అని బాగా ఉదరగొట్టింది.

దాంతో నేను టెంప్ట్ అయ్యి ఒక లాప్ టాప్ ఆర్డర్ పెట్టాను.కానీ వారు ఇలా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు.

ఇది చీటింగ్! దీనికన్నా వారు మార్కెట్లో చేపలు అమ్ముకోవడం మంచిది.అంటూ ఓ కస్టమర్ సదరు వెబ్ పోర్టల్ యాజమాన్యం పైన విరుచుకు పడుతున్నాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే, యశస్వి శర్మ అనే కుర్రాడు తన నాన్న కోసం ఆన్‌లైన్లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేసాడట.

ఆర్డర్ డెలివరి సమయంలో ఓపెన్ బాక్సు కాన్సెప్ట్ తెలియకపోవడంతో వాళ్ళ నాన్న డెలివరి బాయ్ ఇచ్చిన బాక్సు తీసుకుని అతడికి OTP చెప్పి పంపించేశాడట.

కట్ చేస్తే, ల్యాప్‌టాప్ బాక్సు ఓపెన్ చేసి చూడగా ల్యాప్‌టాప్‌కి బదులుగా ఘడి బట్టల సబ్బులు ఉన్నాయని తేలిందట.

దాంతో వారు అందరూ షాక్ అయ్యారట.దాంతో వారు తమకు జరిగిన అన్యాయానికి ఫ్లిప్ కార్ట్ యజమాన్యానితో మాట్లాడారట.

అయితే వారు అక్కడ రెస్పాండ్ అయిన తీరుకి ఇంకా బాధపడ్డారట.ఇకపోతే డెలివరి బాయ్ వచ్చి, వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయని, అతడి ముందు ల్యాప్‌టాప్ బాక్సు ఓపెన్ చేయలేదని, ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ.

వాళ్లు కూడా యశస్వి శర్మదే తప్పని నిందలు వేసారట. """/"/ అదండీ అసలు విషయం.

మీకు ఎపుడైనా ఇలాంటి మోసపూరిత అనుభవం జరిగితే ఇక్కడ తెలియజేయండి.కాగా తాను ఫ్లిప్‌కార్డ్ చేతిలో ఎలా మోసపోయానన్న మొత్తం వైనాన్ని యశశ్వి శర్మ లింక్‌డ్‌ఇన్ పోస్టులో పేర్కొన్నాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో యశస్వి శర్మ పోస్ట్ వైరల్‌గా మారింది.ఇకపోతే, ఓపెన్ బాక్సు కాన్సెప్ట్ అంటే.

ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ డెలివరి అయిన తర్వాత ఆ బాక్సులో ఏముందనేది ఓపెన్ చేసి చూసి, నిర్ధారించుకున్న తర్వాతే డెలివరి బాయ్ కి OTP చెప్పడం.

అయితే, ఈ విషయం తెలియక చాలామంది ముందే OTP చెప్పి అప్పుడప్పుడు ఇలా మోసపోతూ వుంటారు.

కమలహాసన్ ఇక మీదట విలన్ గా సెట్ అయినట్లేనా..?