వాస్తు ప్రకారం దక్షిణం వైపు.. ఏ వస్తువులను ఉంచాలో తెలుసా..?

చాలామంది వాస్తు ప్రకారం( Vasthu ) నడుచుకుంటున్నారు.అయితే ఈ వాస్తు గురించి కేవలం పండితులకే కాకుండా మనకు కూడా కచ్చితంగా కాస్త అయినా అవగాహన ఉండాలి.

లేదంటే ప్రతి విషయానికి పండితులని పిలవాల్సి వస్తుంది.అయితే ఇంట్లో ఏ దిక్కున ఏముండాలి, బెడ్రూంలో ఏ వస్తువులను ఎలా ఉంచుకోవాలి, బెడ్రూంలో, ఇంట్లో ఉంచకూడని వస్తువులు ఏంటి ఇవన్నీ మనకు కచ్చితంగా తెలిసి ఉండాలి.

అయితే వాస్తు శాస్త్రంలో దక్షిణ దిక్కు( South ) గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని పేర్కొనబడింది.

అయితే ఈ దిక్కున ఎలాంటి వస్తువులు పెట్టుకోవచ్చు ఎలాంటి వస్తువులు తప్పనిసరిగా పెడితే సంపద చేకూరుతుంది అన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కట్టుకున్న ఇల్లు అందమైన నిర్మాణంగా ఉండాలంటే పాజిటివ్ ఎనర్జీ( Positive Energy ) ఇంట్లో ఉండాలి.

అలాంటి ప్రదేశంలో నివసించే వారి మీద దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది.సరైన వాస్తు వలన కట్టడాలు చేస్తే వేలాది సంవత్సరాలుగా నిలిచి ఉంటాయి.

అయితే దక్షిణం వైపు గ్రీకు పురాణాలు చెప్పుకునే ఫినిక్స్ పక్షి చిత్రాన్ని పెట్టుకోవడం చాలా మంచిది.

"""/" / ఈ చిత్రాన్ని పెట్టుకుంటే సమృద్ధికి సంకేతం.అలాగే దక్షిణం వైపు చీపురును ఇంట్లో ఉంచుకోవాలి.

అందువల్ల ఇంట్లో సంపద చేకూరుతుంది.అంతేకాకుండా ఇంట్లో దక్షిణ దిక్కున జీడి మొక్కలను డ్రాయింగ్ రూమ్ లో లేదా హాల్లో పెట్టుకోవాలి.

దానివల్ల వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.ఇక విలువైన వస్తువులు, బీరువా,లాకర్ లాంటి సంపద దాచుకునే వస్తువులను కచ్చితంగా దక్షిణ వైపు పెట్టుకోవాలి.

ఇలా చేయడం వలన ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. """/" / ఎప్పటికీ కూడా దక్షిణం వైపు పూజ గదిని నిర్మించకూడదు.

ఇక చెప్పులు కూడా దక్షిణ వైపు పెట్టుకోకూడదు.ఇలా చెప్పులు దక్షిణం వైపు పెట్టుకుంటే గొడవలు వస్తాయి.

ఇక పొరపాటున కూడా దక్షిణం వైపు తులసి మొక్కను అస్సలు పెట్టకూడదు.ఇక పడక గదిలో పడుకున్న సమయంలో కూడా పాదాలు దక్షిణం వైపు ఉండకూడదు.

ఇలా ఉంటే వైవాహిక జీవితంలో కలతలు వస్తాయి.అలాగే దక్షిణం వైపు వంట గది అస్సలు ఉండకూడదు.

అలాగే దక్షిణంలో వంట చేయడం అస్సలు మంచిది కాదు.

అనిల్ రావిపూడి సినిమాలో చిరంజీవి కత్తి పట్టబోతున్నాడా..?