పితృ దోషం ఉంటే దురదృష్టానికి సంకేతం.. దీన్ని ఎలా నివారించుకోవాలి అంటే..?
TeluguStop.com
ప్రతి మనిషి జీవితంలోను కూడా తండ్రి స్థానం చాలా గొప్పది.జ్యోతిష్య శాస్త్రం( Astrology )లో కూడా తండ్రి స్థానానికి చాలా ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది.
అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రవి తండ్రికి కారకుడు.అంటే పితృ కారకుడు అని అర్థం.
అంతేకాకుండా తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానమే తండ్రి స్థానం అని కూడా.అంతేకాకుండా జాతక చక్రంలో పితృ కారకుడు, పితృ స్థానాధిపతి పితృ స్థానం( Paternal Position ) బలహీనంగా కనిపిస్తే తండ్రి చిన్నతనంలోనే మరణించడం జరుగుతుంది.
లేదా దూరం కావడం జరుగుతుంది.లేదా తండ్రితో శత్రుత్వం ఏర్పడడం జరుగుతుంది.
దీన్నే పితృ దోషం అని అంటారు.పితృ కారకుడు, పితృ స్థానాధిపతి పితృ స్థానం బలంగా ఉన్నప్పుడే తండ్రితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.
అంతేకాకుండా తండ్రి వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.అందుకే వృద్ధాప్యంలో తండ్రిని ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవాలి.
అయితే పితృకారకుడైన రవి జాతక చక్రంలో( Ravi Jataka Chakra ) 6, 8, 12 స్థానాలలో ఉన్న లేక దుస్థానాలలో ఉన్న ఆ జాతకుడికి తప్పకుండా పితృ దోషం ఉందని అర్థం.
అయితే పితృ దోషం ఉన్న జాతకులు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. """/" /
అలాగే తరచూ దురదృష్టాలు వారి ఇంటి తలుపు తడుతూ ఉంటాయి.
అందుకే ఇటువంటి జాతకులు తండ్రి ప్రేమకు ఏదో ఒక కారణంగా దూరమవుతారు.అంతేకాకుండా తండ్రి అండదండలను కోల్పోతారు.
దీనివల్ల జీవిత ప్రాథమిక దెబ్బ తింటుంది.అలాగే జాతక చక్రంలో 9వ స్థానం పితృస్థానం అయితే ఈ స్థానంలో పాపగ్రహాలు ఉండడం తండ్రికి అంత మంచిది కాదు.
ఈ స్థానంలో శుభగ్రహాలు ఉంటే తండ్రికి యోగం పడుతుంది.అలాగే ఆ యోగ ప్రభావం తప్పకుండా ఆ తండ్రి పిల్లల మీద కూడా ఉంటుంది.
"""/" / ఎందుకంటే జాతక చక్రంలో 9వ స్థానంలో కుజుడు, శని, రాహువు, కేతువు లాంటి పాప గ్రహాలు ఉంటే తండ్రికి తీరని కష్టనష్టాలు వస్తాయి.
అయితే తొమ్మిదవ స్థానంలో గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు ఉంటే తండ్రికి శుభయోగాలు, అదృష్ట యోగాలు పట్టి కుటుంబం అన్ని విధాలుగా అభివృద్ధిలో ఉంటుంది.
జాతక చక్రంలో పితృ దోషం ఉన్నవారు కచ్చితంగా ప్రతినిత్యం ఆదిత్య హృదయం చదువుకోవటం చాలా మంచిది.
అంతే కాకుండా తండ్రి పేరిట తరచూ సుబ్రహ్మణ్య స్వామికి అర్చన లేకపోతే పూజ చేయించడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.
రాజమౌళి సినిమాలలో ఆ సినిమాకు మాత్రం నష్టాలు వచ్చాయట.. ఏం జరిగిందంటే?