ఈ రోజులలో అగరబత్తి వెలిగిస్తున్నారా.. అయితే పితృ దోషం..!

భగవంతునికి చేసే సాధారణమైన పూజలో ( Pooja ) కూడా అగరబత్తినీ( Incense Stick ) కచ్చితంగా ఉపయోగిస్తారు.

అగరబత్తికి పూజలో అంతా ప్రాముఖ్యత ఉంది.సాధారణంగా ముగించే పూజలో చేసే పంచోపచారాల్లో ధూపం కూడా ఉంటుంది.

హిందువులందరి ఇళ్ళలోనూ ప్రతిరోజు దేవారాధన జరుగుతూ ఉంటుంది.అగర ధూపం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి దేవుడు ప్రసన్నుడు అవుతాడని పెద్దవారు నమ్ముతారు.

సాధారణంగా పూజా సమయంలో దీప ధూపాలతో దైవారాధన చేస్తారు.అగర పొగ వల్ల ఇల్లంతా కూడా సువాసనతో నిండి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే.

పూర్వం రోజులలో ఉపయోగించే అగరవత్తులలో ఔషధ గుణాలు కలిగి ఉండేవి.అగరబత్తుల తయారీలో గుగ్గిలం, సాంబ్రాణి వంటివి ఉపయోగించేవారు.

ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో అగరబత్తులను సాంబ్రాణి కడ్డీలనే ఉపయోగిస్తారు.ఇలాంటి అగర పొగ ఇంట్లో వ్యాపించినప్పుడు ఆ సుగంధ భరిత పొగా పీల్చడం వల్ల మెదడులోని ఒత్తిడి అదుపు చేసే ప్రోటీన్ ఉత్పత్తి అవుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.

"""/" / అయితే ఇలాంటి అగరబత్తిని వెలిగించడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని చాలామందికి తెలియదు.

వాస్తు అగరబత్తి వెలిగించడంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం వారంలో ముఖ్యంగా రెండు రోజులు ధూపం వేయడం అశుభం అని నిపుణులు చెబుతున్నారు.

పొరపాటున కూడా మంగళ, ఆదివారాల్లో ఇంట్లో అగరబత్తి వెలిగించకూడదు.ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవేశించే అవకాశం ఉంది.

"""/" / అలాగే పితృ దోషం( Pitru Dosham ) కూడా ఏర్పడుతుంది.

అగరబత్తిని తయారు చేయడానికి వెదురుని ఉపయోగిస్తారు.వాస్తు ప్రకారం హిందూమతంలో వెదురు చాలా పవిత్రమైనది.

ఇది మంచి ఫలితాల కోసం ఇంట్లోనూ, వ్యాపార స్థలాలలోనూ, కార్యక్రమాలలోనూ వెదురు మొక్కలను పెంచుకుంటారు.

ఆదివారం, మంగళవారాలలో వెదురును కాల్చకూడదని శాస్త్రం చెబుతోంది.అందువల్లే ఈ రెండు రోజుల్లో అగరవత్తి వెలిగించకూడదని పండితులు చెబుతున్నారు.

అలాగే వెదురును ఎవరు కాల్చినా వారికి సంతన హాని కలుగుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

వైరల్ వీడియో: రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?