జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అంటూ టీడీపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఫలితాలు వెలువడనున్నాయి.ఈసారి ఏపీలో అధికారం ఎవరు చేపడతారు అన్నది ఆసక్తికరంగా ఉంది.

80 శాతానికి పైగానే పోలింగ్ నమోదు కావడంతో ఎవరు గెలుస్తారు అన్నదానిపై బయట కోట్ల రూపాయలలో బెట్టింగ్ జరుగుతుంది.

ఏపీలో అనేక పార్టీలు పోటీ చేసిన ప్రధానంగా వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి( YCP Vs TDP Alliance ) మధ్య పోటీ ఉంది.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఈ రెండు పార్టీలలో ఒకటి అధికారంలోకి వస్తుందని పేర్కొనటం జరిగింది.

ఎన్నికలలో గెలుపు విషయంలో టీడీపీ.వైసీపీ నాయకులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

"""/" / అంతేకాకుండా ఎవరికి వారు సంబరాలు చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది.

పరిస్థితి ఇలా ఉండగా మరి కొద్ది గంటలలో ఫలితాలు రాబోతున్న క్రమంలో పిఠాపురం ( Pithapuram ) తెలుగుదేశం కీలక నేత వర్మ ( Varma ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.సినీ రంగాన్ని వదులుకొని తెలుగుదేశం కోసం పనిచేయాలి అనుకుంటే.

ఎన్టీఆర్ కు సముచిత స్థానం కల్పించే బాధ్యత తానే తీసుకుంటానని వర్మ వ్యాఖ్యానించారు.

ముందు ఆయన పార్టీలో చేరి తనని తాను నిరూపించుకోవాలని పేర్కొన్నారు.లోకేష్.

ఎన్టీఆర్ కు మధ్య పోలికలు ఉన్నాయని చెప్పడం కేవలం అభూత కల్పనే అని వర్మ వ్యాఖ్యానించారు.

కాగా ఈసారి ఎన్నికలలో పిఠాపురం నుండి పోటీ చేయాల్సిన వర్మ పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేయడం జరిగింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు.. ప్రముఖ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!