మహిళపై పిట్‌బుల్ అటాక్.. హీరోలాగా వచ్చి ఎలా కాపాడాడో చూస్తే.. హ్యాట్సాఫ్ అంటారు..!

సాధారణంగా కుక్కలు మనుషులపై దాడి చేయడం కామన్.అయితే ఇతర జాతుల కుక్కలతో పోలిస్తే పిట్‌బుల్ డాగ్స్ ఎక్కువగా అటాక్ చేస్తుంటాయి.

వీటిని బయటికి వదిలితే చాలు ఎవరో ఒకరి ప్రాణాలు తీసేదాకా నిద్రపోవు.ఇవి మనుషుల మీదే కాదు ఇతర కుక్కల మీద కూడా దాడులు చేసి చంపేస్తాయి.

చిన్నతనం నుంచి చాలా చక్కగా పెంచితే ఇవి యజమానులను ఏమీ చేయవు.అలాగే వాటిని కొత్త ప్రదేశాలకు తీసుకెళ్తూ అందరితో కలిపితే కొద్దిగా సౌమ్యంగా ప్రవర్తిస్తాయి.

కానీ ఒకే ఇంటికి పరిమితం చేసి పెద్దగా ప్రేమ లేకుండా భోజనాలు పెట్టి పెంచితే అవి చాలా అగ్రేసివ్‌గా మారుతాయి.

అలాంటివి బయటికి వస్తే బీభత్సం సృష్టిస్తాయి.తాజాగా ఇలాంటి ఒక పిట్‌బుల్ డాగ్( Pitbull Dog ) బయటికి వచ్చింది.

రోడ్డు మీదకి వచ్చిన దానికి డాగ్ వాకింగ్ చేసుకుంటూ వచ్చిన ఇద్దరు యువతులు కనిపించారు.

వారి చేతిలో రెండు చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి.వాటిని చంపేద్దామని ఈ పిట్‌బుల్ డాగ్ దూసుకు రావడం మొదలుపెట్టింది.

ఈ పెద్ద డాగ్‌ను చూసి ఆ ఓనర్స్ వెంటనే అప్రమత్తమై ఆ పిల్ల కుక్కలను పైకి ఎత్తి పట్టుకున్నారు.

కానీ వాటిని చంపేందుకు ఆ కుక్క తెగ ప్రయత్నించింది.చివరికి ఓనర్ కాలు కొరకడం మొదలుపెట్టింది.

దాని పదునైన పళ్ళు, బలమైన దవడల వల్ల సదర మహిళా అల్లాడిపోయింది.కింద పడిపోయి ఏడుస్తూ బాధను వ్యక్తపరిచింది.

ఇంకొక యువతి రెండు కుక్క పిల్లలను సురక్షితమైన ప్రాంతానికి తరలించింది.కానీ మహిళ మాత్రం కుక్క నుంచి విడిపించుకోలేకపోయింది.

"""/" / అయితే దగ్గర్లోనే ఉన్న ఒక వ్యక్తి ఈ దృశ్యాలను చూసి షాక్ అయ్యాడు.

వెంటనే ఉరుకుల పరుగులు తీసుకుంటూ వచ్చాడు.తర్వాత ఆ మహిళ కాలును కొరుకుతూ ఉన్న పిట్‌బుల్ డాగ్ మెడ, తలను తన చేతులతో గట్టిగా ఒత్తి పట్టుకున్నాడు.

కొద్దిసేపటి తర్వాత ఆ కుక్క స్పృహ తప్పి కింద పడిపోయింది.దాంతో మహిళా కుక్క నోట్లో నుంచి తన కాలు విడిపించుకోగలిగింది.

కొన్ని సెకండ్ల పాటు రోడ్డుపై కొట్టుకుంటూ పిట్ బుల్ డాగ్ కనిపించింది.అనంతరం అక్కడ నుంచి లేచి పారిపోయింది.

"""/" / హీరోలా వచ్చి మహిళను కాపాడిన సదరు వ్యక్తిని చాలామంది పొగుడుతున్నారు.

చాలా గొప్ప పని చేశావు, బ్రేవ్ మ్యాన్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అతని సమయానికి వచ్చి కాపాడాడు, లేకపోతే పరిస్థితి ఏమై ఉండదో అని చాలామంది కామెంట్లు పెట్టారు.

మొత్తం మీద కుక్క బతికి పారిపోయింది.అది తర్వాత ఎవరి మీద దాడి చేస్తుందేమో అని మరి కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి అగ్రేసివ్ డాగ్స్ ని మనుషులు తిరిగే చోట ఉంచరాదని ఇంకొందరు సూచించారు.

సీసీటీవీ వీడియోస్ అనే ఎక్స్ పేజీ షేర్ చేసిన ఈ షాకింగ్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

ముడతలను పోగొట్టే మునగాకు.. ఇంతకీ ఎలా వాడాలో తెలుసా?