జిల్లాల పర్యటనలో బిజిబిజీగా గులాబీ బాస్..!!

గులాబీ బాస్, సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇందులో భాగంగా ఇవాళ జడ్చర్ల, మేడ్చల్ లో కేసీఆర్ పర్యటించి ప్రచారం చేయనున్నారు.

ఈ క్రమంలోనే రెండు ప్రాంతాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.

ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.అయితే ముందుగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి జడ్చర్ల వెళ్లనున్న సీఎం కేసీఆర్ అక్కడ ఏర్పాటు చేసే ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతారు.

తరువాత మేడ్చల్ కు వెళ్లనున్న కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు అక్కడి సభలో పాల్గొంటారు.

కాగా లక్ష మంది జనసమీకరణతో మేడ్చల్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది.

ఈ స్టార్ హీరోల భార్యల గురించి మీకు తెలుసా.. ఆ వ్యాపారాల్లో అదుర్స్ అనిపించారుగా!