వైరల్ వీడియో: కోట్ల విలువైన విమానానికి గాలి ఇలా కొడుతున్నాడు!

ఈ రోజుల్లో సోషల్ మీడియా( Social Media ) వినోదానికి, ఆశ్చర్యానికి వేదికగా మారింది.

ప్రతి రోజు రకరకాల ఫన్నీ, ఆసక్తికర వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మన ముందుకు చేరుకుంటోంది.

అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తే, కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.తాజాగా అలాంటి ఓ విచిత్రమైన ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.

విమానం ప్రయాణం అంటేనే ఖరీదైన వ్యవహారమే.అలాగే, ప్రయాణానికి ముందు విమానం అన్ని విధాలుగా సరిగా పనిచేస్తుందా అనే విషయంలో అత్యధిక జాగ్రత్తలు తీసుకుంటారు.

ముఖ్యంగా విమానం టైర్లలో సరైన గాలి ఒత్తిడి ఉండటం అనేది విమాన, ప్రయాణికులకు భద్రతకి చాలా కీలకం.

అయితే, తాజాగా ఒక వీడియోలో ఊహించని దృశ్యం కనిపించింది.ఒక చార్టర్ విమానం( Charter Flight ) రన్‌వేపై ఆగి ఉంది.

విమానానికి టైరు పూర్తిగా గాలిలేని స్థితిలో ఉన్నాయి.ఈ పరిస్థితిని గమనించిన పైలెట్, వెంటనే రంగంలోకి దిగి.

విమాన టైర్లలో గాలి నింపేందుకు సైకిల్ టైర్లకు గాలి కొట్టడానికి ఉపయోగించే చిన్న హ్యాండ్ పంప్ ను తీసుకొని గాలి కొట్టడం ప్రారంభించాడు.

ఇది చూసినవాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.సాధారణంగా వేల కోట్ల విలువ చేసే విమానాన్ని సైకిల్ పంపుతో సర్దుబాటు చేస్తున్న దృశ్యం చూడటమే ఒక ఫన్నీ సన్నివేశంగా మారింది.

ఇలా పైలెట్ గాలి కొట్టడం చూసి అందులోని ప్రయాణికులు దిగి వెళ్లిపోవడం మనం వీడియోలో గమనించవచ్చు.

"""/" / ఈ ఘటనను అక్కడున్న వారు తమ స్మార్ట్‌ఫోన్‌ల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.

నెటిజన్లు దీనిపై అనేక రకాలుగా స్పందిస్తున్నారు.కోట్లు పెట్టి విమానం తీసుకొచ్చారు.

గల్లీ కొట్టడానికి ఇలాంటి చిల్ల పని ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తంగా ఈ వీడియోను చూస్తే ఏదో రీల్స్ చేయడానికి మాత్రమే చేసినట్లు కనపడుతుంది.

మొత్తానికి విమానం టైర్లలో గాలి కొట్టిన ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

మీరు ఈ వీడియో చూసి ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.