టీఎస్ సెక్రటేరియట్ అగ్నిప్రమాద ఘటనపై హైకోర్టులో పిల్
TeluguStop.com
తెలంగాణ నూతన సచివాలయంలో ఇటీవల చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అయితే, తన పిల్ విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని కేఏ పాల్ చీఫ్ జస్టిస్ బెంచ్ లో మెన్షన్ చేశారు.
ఈ క్రమంలో స్పందించిన చీఫ్ జస్టిస్ బెంచ్ కేఏ పాల్ పిల్ కి నెంబరింగ్ ఇవ్వాలని రిజిస్ట్రార్ కి ఆదేశాలు జారీ చేసింది.
కాగా, కేఏ పాల్ పిటిషన్ రేపు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
చిరంజీవితో సినిమా చేయాలంటే ఈ ఆస్థాన రచయితల సలహాలు కూడా తీసుకోవాల్సిందే…