ఉత్సాహంగా పందుల పోటీలు.. విజేతలకు ప్రైజ్‌మనీ

పండగలు వచ్చినప్పుడు గ్రామాల్లో ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాలలో కోడి పందేలు నిర్వహిస్తుంటారు.

వీటికి కోసం పక్క రాష్ట్రాల నుంచి కూడా పందెంరాయుళ్లు వస్తుంటారు.భారీగా బెట్టింగ్స్ వేసి, గెలిచినా ఓడినా కోడిపందేలలో పాల్గొన్న అనుభూతితో అక్కడి నుంచి వెళ్లిపోతారు.

కొన్ని చోట్ల గుర్రపు పందేలు నిర్వహిస్తుంటారు.ఆ పోటీల్లో గెలిచిన గుర్రాలకు బహుమతులు ఇస్తుంటారు.

మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందేలు నిర్వహిస్తుంటారు.ఎడ్లకు బండలు కట్టి వాటిని లాగే పోటీలు నిర్వహిస్తుంటారు.

ఏవి ముందు పరుగులు పెడితే అవే విజేతలుగా నిలుస్తాయి.అయితే ఓ చోట మాత్రం ఆశ్చర్యకరంగా పందుల పోటీలు నిర్వహిస్తున్నారు.

గెలిచిన వాటికి భారీగా ప్రైజ్ మనీ కూడా ప్రకటిస్తున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా దౌదర్ పల్లి శివారులో ఇటీవల భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర నిర్వహించారు.

"""/" / ఇక్కడ పందుల పందేలు నిర్వహించారు.ఈ పోటీలకు తెలంగాణ, ఏపీ, కర్ణాటకకు చెందిన 20 పందులు వచ్చాయి.

వాటికి ఏకలవ్య సంఘం నిర్వహణలో పందుల పందేలు నిర్వహించి భారీగా నగదు బహుమతులు కూడా అందించారు.

మొదటి స్థానంలో నిలిచి పందుల విజేతలకు రూ.30 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన పందుల యజమానులకు రూ.

20 వేలు.తృతీయ బహుమతిగా రూ.

10 వేలను అందజేశారు. """/" / అయితే ఈ పోటీలను చూడడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి భారీగా ప్రజలను తరలి వచ్చారు.

ఇదే తరహాలో సంక్రాంతి సమయంలో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోనూ ఈ పందుల పోటీలను నిర్వహించారు.

కుంచనపల్లి గ్రామంలో నిర్వహించిన ఈ పందుల పందేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.సంప్రదాయంగా చాలా ఏళ్ల నుంచి పండగల సమయంలో ఈ పందుల పందేలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.

షాకింగ్ వీడియో: రష్యన్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇండియన్.. భర్త ఏం చేశాడంటే..?