ఇంత ధైర్యం ఏంటి జగన్ ?

జగన్ రాజకీయాలు ఎవరికి అర్థం కావడం లేదు.ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అన్ని వర్గాలకు తానే నాయకుడిని అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు.

అన్ని కులాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ , నిధులు కేటాయిస్తూ , అన్ని వర్గాల మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు.

  అలాగే కులం మతం, వర్గం అనే బేధం లేకుండా రాష్ట్రంలో అందర్నీ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీని కోసం ఎన్నో కొత్త కొత్త సంక్షేమ పథకాలను అమలు చేసి వారి అందరి మద్దతు తనకు ఉండేలా చూసుకుంటున్నారు.

కేవలం ఈ ఐదేళ్ల తన పరిపాలనను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేయడం లేదు.

మరో 10, 15 ఏళ్ల వరకు తనకు తిరుగులేకుండా చేసుకునేందుకు ఈ విధంగా అందరినీ ఆకట్టుకునే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నారు.

ఇదే సమయంలో ప్రతిపక్షాలను బలహీనం చేసి, వారు ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశం లేకుండా,  వారు తమ మేనిఫెస్టోలో కూడా పథకాలు ప్రకటించే లేని స్థాయిలో అన్నిటినీ ఇప్పుడే జగన్ అమలు చేసి చూపిస్తున్నారు.

అయితే ఇవన్నీ చిన్నాచితక పథకాలు అయితే కాదు.భారీ స్థాయిలో వేల కోట్ల బడ్జెట్ తో అమలు చేస్తున్నారు.

కరోనా కష్ట కాలం లోనూ ఈ సంక్షేమ పథకాలను నిలిపివేసేందుకు జగన్ ఇష్టపడడం లేదు.

అసలు ఈ పథకాలకు అంత సొమ్ము ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నారని నోరెళ్ళబెట్టే పరిస్థితి జగన్ కల్పించారు.

తాజాగా ఏపీ బడ్జెట్ నే చూసుకుంటే, భారీ ఎత్తున నిధులు కేటాయింపు చేశారు.

అన్ని కులాలకు ప్రత్యేకమైన బడ్జెట్ ను కేటాయించారు.అలాగే మహిళలకు,  బాలలకు వేల కోట్లు కేటాయించారు.

పిల్లల నుంచి ముసలివారి వరకు ఎవరిని వదిలిపెట్టకూడదు అనే విధంగా అందరికీ సంక్షేమ పథకాలు అమలు అయ్యే విధంగా జగన్ కేటాయింపులు చేశారు.

"""/"/ ఆర్థికంగా ఏపీ ఇబ్బందుల్లో ఉన్న,  అసలు జగన్ ఏ ధైర్యంతో ఈ విధంగా ముందడుగు వేస్తున్నారు అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

ప్రజలు ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా సొంత పార్టీ నాయకులు మంత్రులు సైతం జగన్ నిర్ణయాలకు నోరెళ్ళబెట్టి పరిస్థితి కనిపిస్తోంది .

ఇక మిగతా రాష్ట్రాలకు జగన్ మార్గదర్శిగా మారారు.ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు,  నిర్ణయాలను చాలా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు.

ఇవన్నీ దేశవ్యాప్తంగా తన ఇమేజ్ పెంచడంతోపాటు, వైసిపి మరింతగా బలోపేతం అయ్యేందుకు,  రాబోయే రోజుల్లో తిరుగులేకుండా ఉండేలా చేసేందుకు  దోహదం చేస్తాయి అని జగన్ నమ్ముతున్నారు.

అందుకే ఎన్ని అడ్డంకులు వస్తున్నా అధిగమిస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు.

కెనడాలో భారతీయ యువకుడి దారుణహత్య.. పోలీసుల అదుపులో అనుమానితుడు