పికాసో పెయింటింగ్స్ ధర అన్ని కోట్లా.. నోరెళ్లబెడుతున్న నెటిజన్స్..!

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన చిత్రాలకు మంత్ర ముగ్ధులైనవారు కోట్లలోనే ఉన్నారు.

మిలియన్ డాలర్లు ఖర్చు చేసైనా సరే అతని పెయింటింగ్స్ దక్కించుకోవడానికి లక్షల మందిని క్యూ కడతారంటే అతిశయోక్తి కాదు.

అలాంటి అమూల్యమైన పికాసో చిత్రాలు ఇప్పుడు ఎంత ధరకు పలికాయో తెలుసుకుంటే గుండె ఆగి పోవాల్సిందే.

ఇటీవల పికాసో వేసిన 9 చిత్రాలకు లాస్‌వెగాస్‌లో సౌత్‌బే అనే సంస్థ ఈ-వేలం నిర్వహించింది.

అలాగే రెండు సిరామిక్‌ ఆర్ట్ వర్క్స్ కూడా వేలానికి తీసుకొచ్చారు.అయితే ఈ రెండు మాస్టర్ పీస్ వర్క్స్ 108.

9 మిలియన్‌ డాలర్ల (రూ.817 కోట్లు)కు అమ్ముడయ్యాయి.

శనివారం పికాసో 140వ జయంతి సందర్భంగా ఈ వేలాన్ని నిర్వహించారు.ఈ వేలంలో కొందరు ఆర్ట్ లవర్స్ పికాసో తొమ్మిది పెయింటింగ్స్ ను భారీ ధరకు సొంతం చేసుకున్నారు.

అయితే వారి పేర్లు మాత్రం బయటకు వెల్లడించలేదు."Femme Au Beret Rouge-orange” అనే ఎరుపు-నారింజ రంగు టోపీ ధరించిన మహిళ చిత్రం 40 మిలియన్ల డాలర్ల( సుమారు రూ.

300 కోట్లు)కు అమ్ముడుపోయింది.హోమ్ ఎట్ ఎన్‌ఫాంట్ (మ్యాన్ అండ్ చైల్డ్) పేరు గల మాస్టర్ పీస్ 24.

4 మిలియన్ డాలర్లకు విక్రయించబడింది.ఈ ఆర్ట్స్ అన్ని గత 20 సంవత్సరాలుగా సేకరించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ఎంజీఎం రిసార్ట్స్ యాజమాన్యంలోని ఈ ఆర్ట్స్ బెల్లాజియో హోటల్‌లోని పికాసో రెస్టారెంట్‌లో ప్రదర్శనకు పెట్టారు.

అయితే ఇవి తక్కువ ధరకే పలుకుతానని రిసార్ట్స్ యాజమాన్యం భావించింది.కానీ అవి భారీ రేటు పలికి ఆశ్చర్యపరిచాయి.

"""/"/ స్పానిష్ చిత్రకారుడైన పికాసో పూర్తి పేరు పాబ్లో పికాసో అని అందరికీ తెలిసిందే.

1881 అక్టోబర్ 25న స్పెయిన్ లో జన్మించారు.శనివారం అక్టోబర్ 25న తన 140వ జయంతి సందర్భంగా ఈ వేలాన్ని నిర్వహించారు.

ఏదేమైనప్పటికీ ఈ రోజుల్లో కూడా అతని పెయింటింగ్స్ వందల కోట్ల రూపాయలకు అమ్ముడు పోవడంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

ఈ రోజుల్లో పికాసో ఉన్నట్లయితే ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుడై ఉండేవాడని కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం భారీ ధరకు సేల్ అయిన పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.