ఈ విషయం తెలుస్తే కన్నీళ్లొస్తాయి..! మరోసారి గాలిపటాలు ఎగిరేసేటప్పుడు అది వాడరు!

సంక్రాంతి అంటే మనకి గుర్తొచ్చేది ముగ్గులు,గాలిపటాలు, పిండి వంటలు.అందరు కలిసి సంతోషంగా గడుపుతారు.

కానీ మన సంతోషం పక్షుల పాలిట యమపాశమవుతోంది.మన గాలిపటంకి కట్టే చైనీస్ మాంజ పక్షులకి ఉరితాడులాగా మారాయి.

గాలిపటం మంజా తగిలి మృతి చెందిన ఓ రామచిలుక ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

బిదితా బాగ్‌ అనే వ్యక్తి ఈ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ మంజా దారానికి చిక్కి ప్రాణాలు కోల్పోయిన రామచిలుక ఎంత విలవిలలాడి ఉంటుందోనని పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరి కొందరు ‘ఫోటోకు తగ్గ క్యాప్షనే పెట్టారు నిజంగానే రామ చిలుక కాయ్‌పో చీ’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

రోబో సినిమాలో లాగ గనుక పక్షి రాజా బతుకుంటే సెల్ ఫోన్స్ బదులు గాలిపటాలు లాగేసుకునేవాడేమో అంటూ కామెంట్ చేస్తున్నారు మరికొందరు.

‘కాయ్‌పో చీ’ అనేది గుజరాతి పదం.గాలిపటాల ఎగరేసేటప్పుడు ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు.

అవతలి వారి గాలిపటాన్ని కట్‌ చేస్తే కాయ్‌పో చీ అంటారు.నిషేధిత చైనా మంజా వల్ల పక్షులే కాక మనుషులు కూడా మృత్యువాత పడ్డారు.

మంజా వల్ల గొంతు తెగి ఓ ఎనిమిదేళ్ల బాలుడు మరణించిన సంగతి తెలిసిందే.