ఒంటి కాలితోనే సైకిల్ తొక్కుతున్న వ్యక్తి.. వెనుక భార్యా బిడ్డలను ఎక్కించుకుని బతుకు పోరాటం
TeluguStop.com
ప్రస్తుతం రోజు రోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయి.ఏదైనా తినాలన్నా, కొనాలన్నా సామాన్యులు భయపడుతున్నారు.
ముఖ్యంగా పేద వారికి రోజు గడవడం కష్టం అయిపోతోంది.గ్యాస్ ధరలు, పెట్రోల్-డీజిల్ ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో అద్దెలు కట్టుకోలేక చాలా మంది సతమతం అవుతున్నారు.దీంతో చాలా మంది వాహనాలు బయటకు తీయలేక, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఆశ్రయిస్తున్నారు.
ఖర్చులు తగ్గించుకునేందుకు ఇలా చేయడం తప్పడం లేదు.అయితే పేద వారి పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది.
అందులోనూ కాళ్లు లేని ఓ వ్యక్తి తన కుటుంబాన్ని పోషించడం అంటే సాధారణ విషయం కాదు.
ఇక ఓ వ్యక్తి ఒంటి కాలితోనే సైకిల్‌పై తన కుటుంబాన్ని ఎక్కించుకుని తొక్కడం చాలా మంది నెటిజన్లను తాకుతోంది.
ఇటీవల ఓ వ్యక్తి సైకిల్ తొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
ఇందులో ఆశ్చర్యం ఏముందని అంతా భావిస్తారు.అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వ్యక్తికి కాలు లేదు.
పైగా కర్రల సాయంతో నడుస్తుంటాడు.అలాంటి వ్యక్తి ఒక కాలితోనే సైకిల్ తొక్కడం అంటే అది ఖచ్చితంగా ఆశ్చర్యకరమైన విషయమే.
అందులోనూ వెనుక ఒకరిని, ముందు ఒకరిని ఎక్కించుకుని సైకిల్ తొక్కడం చాలా అభినందనీయమైన విషయం.
అందుకే ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అయింది. """/" /
ముఖ్యంగా సైకిల్ ఎక్కే ముందు కర్ర సాయంతో ఎక్కాడు.
ఆపై కర్రను ఆసరాగా చేసుకుని కొంచెం కొంచెం సైకిల్ తొక్కాడు.పైగా భార్యను వెనుక, కొడుకును ముందు కూర్చోబెట్టుకున్నాడు.
కష్టమైనా కర్ర సాయంతో సైకిల్ తొక్కుతూ ముందుకు సాగాడు.ఇది ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు.
అయితే ఈ వీడియో వైరల్ అవగానే నెటిజన్లను బాగా కదిలిస్తోంది.కొంత మంది ఆ దివ్యాంగుడి దుస్థితి చూసి చలించిపోతున్నారు.
ఓ కాలు లేకున్నా, జీవిత భారాన్ని మోస్తున్నాడని ప్రశంసిస్తున్నారు.ముఖ్యంగా భార్య, పిల్లలు కష్టపడకుండా ఆ భారాన్ని తన నెత్తి మీదనే వేసుకుంటున్నాడని అభినందిస్తున్నారు.
తారా స్థాయికి చేరిన మంచు ఫ్యామిలీ గొడవలు… లక్ష్మి ప్రసన్న పోస్ట్ వైరల్!