టవల్ లో ఫోటో షూట్… నెట్టింట వైరల్!

సాధారణంగా మన కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఫోటో షూట్ పెట్టించడం ప్రస్తుత కాలంలో సర్వసాధారణమే.

కొత్తగా పెళ్లి అయిన వారు ఫోటో షూట్ కోసం కొందరు సాంప్రదాయ దుస్తులను ధరిస్తూ ఉంటారు, మరికొందరు కేవలం ఫోటోషూట్ కోసం మాత్రమే ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు.

కానీ రిషి కార్తికేయన్.లక్ష్మీ కేరళకు చెందిన నవదంపతులు.

కరోనా కారణం వల్ల వీరి పెళ్లి పెద్ద హడావిడిగా జరగకుండా, కేవలం కొద్ది మంది అతిథులు సమక్షంలోనే జరిగింది.

పెళ్లి అయితే ఎలాగో గ్రాండ్ గా జరగలేదని భావించిన ఈ జంట తమ వెడ్డింగ్ షూట్ వెరైటీగా, అందంగా డిజైన్ చేయించాలనిఅనుకున్నారు.

అనుకున్నది మొదలు ఫోటోగ్రాఫర్ అయిన తన స్నేహితునికి వారి ఆలోచన గురించి చెప్పారు.

వీరి వెడ్డింగ్ ఫోటో షూట్ కి ఇడుక్కిలోని ప్రకృతి అందాలను కనువిందు చేస్తున్న తేయాకు తోటలు వీరి ఫోటోషూట్ జరిగింది.

అయితే వీరు తీయించుకున్న ఫోటోలను కాస్తా సోషల్ మీడియాలో ఎప్పుడైతే షేర్ చేశారో, అప్పుడే వీరికి అసలు సమస్యలు మొదలయ్యాయి.

తేయాకు తోటలో తెల్లని దుస్తులతో తమను తాము కప్పుకొని పరుగులు తీస్తున్నట్టు గా తీసిన ఫోటోను షేర్ చేయడం తో, ఆ ఫోటో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

ఇలాంటి ఫోటోలను సమాజానికి చూపించడం ద్వారా, సమాజానికి ఏం తెలియ చేయబోతున్నారని? సదరు నెటిజన్లు వీరి దుస్తులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి తాలూకు జ్ఞాపకాలను భద్ర పరుచుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదా అని మరి కొందరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

ఈ కామెంట్లపై వధువు లక్ష్మి స్పందిస్తూ, హాఫ్ షోల్డర్ టాప్స్ ధరించే వారికి ఇలాంటి కొత్తగా ఏమీ అనిపించదు.

అయినా చూసే కళ్ళలో లోపం ఉంటే, ఎలాంటి దుస్తులు ధరించిన అలానే కనిపిస్తుంది అంటూ ఘాటుగా బదులిచ్చారు.

వైరల్ వీడియో: ఏంటి భయ్యా.. బతికున్న నల్లత్రాచుకు నేరుగా పూజలు చేస్తున్న కుటుంబం..