పేమెంట్స్ రంగంలో దూసుకుపోతున్న ఫోన్ పే.. తాజాగా సరికొత్త ప్రయోగం

డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఫోన్ పే( PhonePe ) దూకుడు ప్రదర్శిస్తోంది.పే టీఎం, గూగుల్ పే కంటే అన్ని విషయాల్లోనూ ముందుగానే ఉంది.

ఫోన్ పే దూకుడుకు మిగిలినవి కుదేలవుతున్నాయి.ఇక వ్యాపారులకు వీలుగా ఉండేందుకు గతంలో పే టీఎం సరికొత్తగా స్మార్ట్ స్పీకర్ తీసుకొచ్చింది.

అదే బాటలో ఫోన్ పే కూడా స్మార్ట్ స్పీకర్‌ను( Smart Speaker ) మార్కెట్‌లో విడుదల చేసింది.

ప్రారంభించిన ఆరు నెలల్లోనే రికార్డు స్థాయిలో 20 లక్షల స్మార్ట్‌స్పీకర్‌ల పంపిణీని ఫోన్‌పే ప్రకటించింది.

స్మార్ట్‌స్పీకర్‌లు కస్టమర్ చెల్లింపులను ఎటువంటి జోక్యం లేకుండా ధృవీకరించడంలో సహాయపడతాయి.వాటి ఆడియో చాలా స్పష్టంగా ఉంటుంది.

"""/" / ఇది 3.5 కోట్ల మంది వ్యాపారులలో నమ్మకం, విశ్వసనీయతను పెంపొందించడంలో సహాయపడింది.

దేశంలోని అన్ని ప్రాంతాలు, నగరాల్లో స్మార్ట్‌స్పీకర్‌లు విస్తృతంగా ఉపయోగించడం పట్ల తాము సంతోషిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సగటున స్మార్ట్ స్పీకర్లు నెలకు 75 కోట్లకు పైగా లావాదేవీలను సాగిస్తున్నట్లు ఫోన్ పే తెలిపింది.

స్మార్ట్ స్పీకర్ల ఫీచర్లలో పోర్టబిలిటీ, మెరుగైన బ్యాటరీ లైఫ్, ఆడియో క్లారిటీ, కాంపాక్ట్, మల్టీఫంక్షనల్ ఫ్యాక్టర్ ఉన్నాయి.

ఇది వ్యాపారులు అత్యంత రద్దీగా ఉండే కౌంటర్ స్పేస్‌లలో కూడా దీనిని ఉపయోగించడానికి వీలుంటుంది.

"""/" / దీనిని వ్యాపారులు కొంత రుసుము చెల్లించి కొనుగోలు చేసే వీలుంటుంది.

ఇదే కాకుండా ఫోన్ పే "పిన్‌కోడ్"( Pincode ) అనే కొత్త షాపింగ్ యాప్‌ను ప్రారంభించింది.

ఈ యాప్ హైపర్‌లోకల్ ఇ-కామర్స్‌పై దృష్టి పెడుతుంది.దానిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ యాప్ బెంగళూరులోని వినియోగదారుల కోసం మాత్రమే లైవ్‌లో ఉందని, త్వరలో ఇతర నగరాల్లోనూ లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

స్థానిక దుకాణదారులు, విక్రేతలను ప్రోత్సహించడం లక్ష్యంగా దీనిని ప్రారంభించారు.

వైరల్: సాక్స్‌లు లేకపోతే ఏం… ఇలా ఎపుడైనా ఆలోచించారా?