Former Chief Prabhakar Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు..: టచ్ లోకి వచ్చిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్..!!
TeluguStop.com
ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు( Former Chief Prabhakar Rao ) పోలీసులకు టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అమెరికా నుంచి ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు ఫోన్ చేశారు.క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చినట్లు ఆయన తెలిపారని సమాచారం.
జూన్ లేదా జులైలో Style="height: 10px;overflow: Hidden"
హైదరాబాద్ కు వస్తున్నట్లు ప్రభాకర్ రావు వెల్లడించారు.
అయితే అప్పటి ప్రభుత్వం చెప్పిన విధంగా పని చేసినట్లు ప్రభాకర్ రావు తెలిపారు.
ఇళ్లల్లో ఎందుకు సోదాలు చేస్తున్నారని ప్రభాకర్ రావు ప్రశ్నించారు.ఏదైనా చెప్పదల్చుకుంటే అధికారిక మెయిల్ కు పంపాలని ఉన్నతాధికారి ఆయనకు తెలిపారని సమాచారం.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు( SIB DSP Praneet Rao ) విచారణలో పలు కీలక విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారని సమాచారం.