ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై ( Prabhakar Rao ) అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

సీఆర్పీసీ 73 సెక్షన్ కింద ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్( Arrest Warrant ) జారీ చేయాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు అనుమతిని ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు బృందం గుర్తించిందన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసులు నలుగురు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

చాపకింద నీరులా హెచ్‌ఎమ్‌పీవీ కేసులు.. భారత్‌లో 18కి చేరిన రోగుల సంఖ్య