Praneet Rao: తెలంగాణ హైకోర్టుకు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్ రావు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు( SIB DSP Praneet Rao ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ మేరకు ప్రణీత్ రావు పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు.

ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రణీత్ రావు పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది.

కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.

పోలీస్ కస్టడీకి ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సవాల్ చేశారు.

ఈ క్రమంలోనే వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుడా తనను కస్టడీకి ఇచ్చిందని పిటిషన్ లో పేర్కొన్నారు.

కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని ప్రణీత్ రావు తరపు న్యాయవాది ఆరోపించారు.

వీడియో: డబ్బాలో తల ఇరుక్కుని హిమాలయన్ ఎలుగుబంటి విలవిల.. రక్షించిన ఇండియన్ ఆర్మీ..