ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో వైసీపీని గట్టెక్కించే బాధ్యతలను మంత్రులపై పెట్టారు సీఎం.
అయితే.కొందరు మంత్రులు ఇంకా దూకుడుగా ముందుకు సాగడం లేదు.
పైగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల డీలా పడిన నేపథ్యంంలో ఇంకా దానినే తలుచుకుని వగరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో ఆశించిన మేరకు దూకుడు ప్రదర్శించలేక పోతున్నారు.ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట కేబినెట్ మీటింగ్ పెట్టిన సీఎం జగన్ ఇదే విషయంపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని.ప్రతి మంత్రి క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.
దీనికి సంబంధించి వర్క్ ప్లాన్ కూడా ఇచ్చారు.ఇక, ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్ మంత్రులకు ఫోన్లు చేస్తున్నారు.
రోజుకు ఇద్దరు మంత్రుల చొప్పులన ఎంపిక చేసుకుని వారితో మాట్లాడి.తాజా పరిస్తితిని తెలుసుకుంటున్నారు.
ఈ క్రమంలో విజయవాడకు చెందిన మంత్రి వెలంపల్లికి సాయంత్రం 4 గంటల సమయంలో ఫోన్ చేశారు.
అయితే.ఆ సమయానికి వెలంపల్లి.
స్థానిక నాయకులతో ఇంట్లో భేటీ అయ్యారు.ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ.
బుద్దా వెంకన్న తనపై చేసిన కామెంట్లపై ఆయన సమాలోచనలు చేస్తున్నారు.కానీ, అదే సమయంలో ఆయన పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని మాత్రం పట్టించుకోలేదు.
దీంతో సీఎం నుంచి ఫోన్ రాగానే ఒక్క ఉదుటున రంగంలోకి దిగారట. """/"/
వెంటనే ఆయన నియోజకవర్గంలో హెచ్ బీ కాలనీ వంటి ప్రాంతాల్లో పర్యటించారు.
వాస్తవానికి కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత.మంత్రులకు సీఎం ఇతర పనులు ఏవీ అప్పగించలేదు.
కేవలం అన్ని కార్పొరేషన్లలోనూ పార్టీని గెలిపించాలనే ఏకైక టార్గెట్ మాత్రమే పెట్టారు.కానీ.
వెలంపల్లి మాత్రం టీడీపీకి ఎలా కౌంటర్లు ఇవ్వాలనే విషయంపై మునిగిపోయారు.దీంతోనే సీఎం క్లాస్ తీసుకున్నారని తెలిసింది.